Breaking News

చౌడు పీడ రబీలోనే ఎక్కువ!

Published on Wed, 12/11/2024 - 11:32

చౌడు సమస్య ఖరీఫ్‌లో కన్నా రబీలోనే ఎక్కువగా ఇబ్బందిపెడుతుంది. చౌడు వల్ల ధాన్యం దిగుబడి తగ్గడం కూడా రబీలోనే ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చౌడును తట్టుకొని 20–25 బస్తాల దిగుబడినిచ్చే డి.ఆర్‌.ఆర్‌. ధన్‌ 39, జరవ, వికాస్‌ అనే వరి వంగడాలు ఉన్నాయి. ఇవి 120–130 రోజుల్లో కోతకొస్తాయి. 

కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో చౌడు సమస్య ఉంది.  మట్టిలో లవణ సూచిక (ఇ. సి.) 4 వరకు ఉంటే కొంత ఫర్వాలేదు. కానీ, మా క్షేత్రంలో ఈ ఏడాది 10.9 ఉంది. ఎక్స్‌ఛేంజబుల్‌ సోడియం పర్సంటేజ్‌ (ఈ.ఎస్‌.పి.) 15% కన్నా పెరిగితే చౌడు సమస్య తలెత్తుతుంది. 

చౌడు భూముల్లో కాలువ నీటితో సాగు చేయడానికి అనువైన మూడు వరి వంగడాలను శాస్త్రవేత్తలు గతంలోనే రూపొందించారు. ఎం.సి.ఎం. 100 అనేది రబీకి అనుకూలం. 125 రోజులు. 28–30 బస్తాల దిగుబడి వచ్చింది. ఎం.సి.ఎం. 101 రకం 140 రోజుల పంట. ఖరీఫ్‌కు అనుకూలం. 35 బస్తాల దిగుబడి. అగ్గి తెగులును, దోమను తట్టుకుంది. ఎం.సి.ఎం. 103 ఖరీఫ్‌ రకం. ఇది రాయలసీమ జిల్లాల్లోనూ మంచి దిగుబడులనిస్తోంది. 

చౌడు భూముల్లో నాట్లకు ముందు జీలుగ సాగు చేసి కలియదున్నాలి. ఇతర పచ్చిరొట్ట పైర్లు వేస్తే ఉపయోగం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైపైనే దమ్ము చేయాలి. సమతూకంగా ఎరువులు వాడాలి. సేంద్రియ ఎరువులు వేయడం మంచిది. రబీలో పొలాన్ని ఖాళీగా ఉంచితే, ఖరీఫ్‌లో 
చౌడు సమస్య ఎక్కువ అవుతుందట.  

(చదవండి: నౌకాయానంలో వర్చువల్‌ వ్యవసాయ శాస్త్రవేత్త)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)