Breaking News

వికసించిన వ్యవసాయ పద్మాలు

Published on Tue, 01/28/2025 - 01:07

వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త సుభాష్‌ శర్మ (మహారాష్ట్ర)తో పాటు హారిమన్‌ శర్మ (హిమాచలప్రదేశ్‌), ఎస్‌. హాంగ్‌థింగ్‌ (నాగాలాండ్‌)లకు కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. సుభాష్‌ శర్మ పత్తి రైతుల ఆత్మహత్యలకు నిలయమైన యవత్‌మాల్‌ జిల్లాలో అనేక దశాబ్దాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ, రైతులకు ఆచరణాత్మక శిక్షణ ఇస్తున్నారు. 

హిమాచలప్రదేశ్‌కు చెందిన హారిమన్‌ శర్మ ఆపిల్‌ సాగును కొండప్రాంతాల నుంచి మైదానప్రాంతాల్లోకి తీసుకొచ్చారు. సాధారణ ఉష్ణోగ్రతలోనూ పండే ఆపిల్‌ వంగడాలను అభివృద్ధి చేశారు. నాగాలాండ్‌కు చెందిన హాంగ్‌థింగ్‌ అధికాదాయాన్నిచ్చే కొత్త పంటలను అక్కడి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోబోతున్న ఈ భూమిపుత్రులకు తెలుగు రైతుల తరఫున శుభాకాంక్షలు చెబుతోంది ‘సాక్షి సాగుబడి’. వారి కృషి గురించి కొన్ని వివరాలు.

కరువు సీమలో కాంతిరేఖ.. సుభాష్‌ శర్మ!  
మహారాష్ట్ర.. విదర్భ.. యవత్‌మాల్‌.. ఈ పేరు వినగానే అప్పుల్లో కూరుకుపోయి బలవన్మరణాల పాలైన ఎందరో పత్తి రైతుల విషాద గాథలు మదిని బరువెక్కిస్తాయి. అయితే, యవత్‌మాల్‌ వ్యవసాయ కథ అంతటితో ముగిసిపోలేదు. ఎడారిలో ఒయాసిస్సు మాదిరిగా సేద్యాన్ని ఆనందమయంగా మార్చుకున్న ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త, సీనియర్‌ ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్‌ శర్మ కూడా అక్కడ దీర్ఘకాలంగా సేద్యం చేస్తున్నారు. యవత్‌మాల్‌ జిల్లా వితస గ్రామ వాస్తవ్యుడైన శర్మ.. నేలతల్లికి ప్రణమిల్లుతూ భూసారాన్ని పరిరక్షించుకుంటూనే అధిక దిగుబడులు సాధిస్తున్నారు. 

సుభాష్‌ శర్మకు 67 ఏళ్లు. ఆరుతడి పంటల సాగులో 47 ఏళ్ల అనుభవం ఉన్న రైతు. రసాయనిక సేద్యపు చేదు అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని దిశను మార్చుకున్నారు. సేద్యంలో గడ్డు సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను వెదికిన తలపండిన ప్రకృతి వ్యవసాయదారుడాయన. అంతేకాదు, నల్లరేగడి పొలాల్లో అనేక వినూత్న సుస్థిర వ్యవసాయ పద్ధతులను స్వీయానుభవంలో కనుగొని, అనుసరిస్తున్న విశిష్ట రైతు శాస్త్రవేత్త కూడా. క్షేత్రస్థాయిలో వ్యవసాయ సమస్యలను లోతుగా పరిశీలిస్తూ.. తన అనుభవంతో, ప్రజ్ఞతో మెట్టప్రాంతాల్లో ప్రకృతి సేద్యానికి అనుగుణమైన సాగు పద్ధతులను సుభాష్‌ శర్మ రూపొందించుకున్నారు. 

30 ఏళ్లుగా ప్రకృతి సేద్యం
సుభాష్‌ శర్మకు 13 ఎకరాల నల్లరేగడి భూమి ఉంది. 1975 నుంచి వ్యవసాయం చేస్తున్న ఆయనకు 20 ఏళ్ల పాటు రసాయనిక ఎరువులు, పురుగుమందులతోనే వ్యవసాయం చేశారు. ఫలితంగా ఆర్థికంగా నష్టాలపాలవటమే కాకుండా భూసారం సర్వనాశనమైపోయింది. 1986 తర్వాత ఖర్చులు పెరుగుతున్నా దిగుబడులు తగ్గిపోతూ వచ్చాయి. ఆ దశలో రసాయనిక వ్యవసాయ పద్ధతే నష్టదాయకమైనదన్న సత్యాన్ని గ్రహించారు. 1994 నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వైపు మళ్లారు. నిశిత పరిశీలనతో ప్రకృతికి అనుగుణమైన ఆచరణాత్మక సుస్థిర వ్యవసాయ పద్ధతులను రూపొందించుకొని అనుసరిస్తూ మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. 
13 ఎకరాల నల్లరేగడి భూమిలో 3 ఎకరాలను ఆవులు, ఎద్దుల మేతకు కేటాయించి మిగతా పది ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కంది, పత్తి, కూరగాయలు, ఆకుకూరలను ఏడాది పొడవునా సాగు చేస్తుంటారు. మార్కెట్‌లో ఎప్పుడు, ఏయే పంట ఉత్పత్తులకు గిరాకీ ఉంటుందో గమనించుకుంటూ రైతులు బహుళ పంటలు సాగుకు ప్రణాళికను రూపొందించుకుంటే మంచి ఆదాయం పొందవచ్చంటారాయన.

పత్తి సాగులో వినూత్న పద్ధతి
ప్రకృతి వ్యవసాయంలో ఆచ్ఛాదన అతి ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే, ఆచ్ఛాదనగా వేయడానికి గడ్డీ గాదం ఎక్కడ దొరుకుతుంది అని రైతులు ప్రశ్నిస్తుంటారు. ఈ సమస్యకు సుభాష్‌ శర్మ అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు.  రెండు సాళ్లు పత్తి వేస్తారు (కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు). ఆ పక్కనే 3 సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలు పెంచి, వాటినే కత్తిరించి ఆచ్ఛాదనగా వేస్తారు. పత్తిని, కందిని కూడా ఈ పద్ధతిలోనే సాగు చేయడం ఆయన ప్రత్యేకత. అధిక దిగుబడిని సాధించే ఈ వినూత్న పద్ధతిని గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్నారు.  ప్రకృతి వ్యవసాయదారుడిగా, పరిశోధకుడిగా ప్రయోగాలు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న సుభాష్‌ శర్మ పై ప్రత్యేక కథనాన్ని 2018 డిసెంబర్‌లోనే ‘సాక్షి సాగుబడి’ ప్రచురించింది. సుభాష్‌ శర్మ తన యూట్యూబ్‌ చానల్‌లో వీడియోలు అందుబాటులో ఉంచారు.
@naturalfarmingbysubhashsharma9
@KrishiTV

అధిక దిగుబడి, అధిక నికరాదాయం!
ప్రకృతి సేద్యంలోని శాస్త్రీయతను అర్థం చేసుకొని రైతులు అనుసరించినప్పుడే సత్ఫలితాలు సాధించగలుగుతారు. పత్తి 2 సాళ్లు వేసి.. ఆ పక్కనే 3 సాళ్లలో  పచ్చిరొట్ట పంటలను సాగు చేస్తే.. భూసారంతో పాటు దిగుబడి కూడా పెరగడం, బెట్టను తట్టుకోవడం వంటి ఎన్నో ప్రయోజనాలు నెరవేరతాయి. చీడపీడల బెడద కూడా తీరిపోతుంది. పచ్చిరొట్ట సాగుకు స్థలం వృథా అవుతున్నదని పొరబడకూడదు, శాస్త్రీయతను అర్థం చేసుకోవాలి. ప్రకృతి సేద్యంలో అధిక దిగుబడి, అధిక నికరాదాయం పొందటం ముమ్మాటికీ సాధ్యమే. 
– సుభాష్‌ శర్మ, ప్రకృతి వ్యవసాయ నిపుణులు, మహారాష్ట్ర

కొత్త పంటల హాంగ్‌థింగ్‌
నాగాలాండ్‌లోని కోక్లక్‌కు చెందిన ఎల్‌. హాంగ్‌థింగ్‌ అనే 58 ఏళ్ల రైతు శాస్త్రవేత్త అధికాదాయాన్నిచ్చే కొత్త ఉద్యాన పంటలను రైతులకు అందుబాటులోకి తేవటంలో విశేష కృషి చేశారు. ఆప్రాంత రైతాంగానికి తెలియని లిచి, నారింజ వంటి కొత్త పండ్ల రకాలను వారికి అందుబాటులోకి తెచ్చారు. 30 ఏళ్లుగా ఉద్యాన తోటలను సాగు చేస్తున్నారు. ఆయన కృషి వల్ల 40 గ్రామాల్లో 200 మంది రైతులు కొత్త రకాల పండ్ల చెట్ల పెంపకం ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోగలిగారు. తిని పారేసిన పండ్ల విత్తనాలను సేకరించి మొలకెత్తించటం వంటి ప్రయోగాలను ఆయన బాల్యం నుంచే చేపట్టటం విశేషం. ఆయన రూపొందించిన అనేక మెళకువలను వందలాది మంది రైతులు అనుసరిస్తూ ఆదాయం పెంచుకుంటున్నారు.

ఆపిల్‌ సాగును దేశవ్యాప్తం చేసిన  హారిమన్‌
ఆపిల్‌ పండ్ల తోటలను హారిమన్‌ శర్మ మంచు కొండల మీద నుంచి మైదానప్రాంతాల్లోకి తీసుకొచ్చారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని గల్లసిన్‌ గ్రామంలో 1956లో ఆయన పుట్టారు. మూడేళ్ల వయసులో తల్లిని కోల్పోయిన ఆయన వ్యవసాయ పనులు చేస్తూ పెరిగారు. కష్టాల్లో పెరిగినప్పటికీ వ్యవసాయంలో కొత్తపోకడలను కనిపెట్టాలన్న తపన ఆయనలో ఉండేది. 1992లో విపరీతమైన మంచు వల్ల ఆప్రాంతంలో మామిడి చెట్లు నాశనమైనప్పుడు ఆపిల్‌ సాగు గురించి ఆలోచించారు. చల్లని కొండప్రాంతాల్లో మాత్రమే ఆపిల్‌ చెట్లు పెరుగుతాయని మనకు తెలుసు. అయినా, తమప్రాంతంలో వాటిని ఎందుకు పెంచకూడదన్న ఆలోచనతో హారిమన్‌ ప్రయోగాలు చేయటంప్రారంభించారు.

పట్టువిడవకుండా కృషి చేసి సముద్రతలం నుంచి 700 మీటర్ల ఎత్తులోని మైదానప్రాంతాల్లో, వేసవిలో 40–45 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వాతవరణంలో కూడా, ఆపిల్‌ పండ్లను సాగు చేయవచ్చని రుజువు చేశారు. 2007లో హెఆర్‌ఎంఎన్‌–99 అనే గ్రాఫ్టెడ్‌ ఆపిల్‌ వంగడాన్ని రూపొందించారు. అప్పటి ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్‌ ధుమల్‌ దృష్టికి వెళ్లటంతోప్రాచుర్యంలోకి వచ్చారు. ఈ రకం ఆపిల్‌ పండ్లను ఇప్పుడు దేశంలో తెలుగు రాష్ట్రాలు సహా 29 రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, జర్మనీలోనూ సాగు చేస్తున్నారు. 

కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ జాతీయ పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నుంచి అందుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో రైతులకు శిక్షణ ఇవ్వటంతో పాటు లక్ష గ్రాఫ్టెడ్‌ ఆపిల్‌ మొక్కలను అందించిన ఘనత ఆయనది.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)