Breaking News

ఆహా.. ఆవకాయ

Published on Wed, 05/14/2025 - 08:53

విశాఖపట్నం: వేడివేడి అన్నం ..ఆ తర్వాత స్వచ్ఛమైన నెయ్యి ..అందులో కాస్త ఆవకాయ ముక్కను కలుపుకొని తింటే... ఆహా! ఆ రుచిని వర్ణించలేం. మొదటి ముద్దతోనే నోరంతా పులకరించిపోతుంది. వేడి అన్నం, కమ్మటి నెయ్యి, ఘాటైన ఆవకాయ... ఈ మూడు రుచులు ఒకదానితో ఒకటి పోటీపడుతూ, నాలుకపై ఒక మాయాజాలాన్ని సృష్టిస్తాయి. 

ఒక్కో ముద్ద తింటుంటే కడుపు నిండిపోతున్నా, ఆ రుచి మాత్రం వదలాలనిపించదు. కళ్లల్లో ఒక విధమైన మెరుపు, పెదాలపై చిరునవ్వు అదే వస్తుంది. వేసవికాలం వచ్చిందంటే ఆవకాయ సీజన్‌ ఆరంభం అవుతుంది. మహిళలు ఏడాది అంతా తినడానికి సరిపోయే విధంగా ఆవకాయ పెడతారు. ఆవకాయ పెట్టడానికి ఎంతో అనుభవం, నైపుణ్యం అవసరం. ఇటువంటి ఆవకాయ తయారీపై నగరంలో పోటీలు నిర్వహించారు. బీచ్‌ రోడ్డులోని ఓ హోటల్‌లో రెడ్‌ ఎఫ్‌ఎం, త్రీ మేంగోస్‌ స్పైసెస్‌ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందమందికిపైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

ఆవపొడి, కారం, ఉప్పు, నూనె సమపాళ్లలో కలిపి నోరూరించే ఆవకాయను క్షణాలలో సిద్ధం చేశారు. యువతుల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహంగా పాల్గొని, ఆవకాయ ఘాటును రుచిచూపించారు. ఆవకాయ తయారు చేసిన మహిళలకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో ఆర్‌జేలు ప్రదీప్, కృష్ణ, షర్మిల, భావన, మధు కార్తీక్‌లతో పాటు ప్రోగ్రామింగ్‌ హెడ్‌ సుష్మ తదితరులు పాల్గొన్నారు.   

#

Tags : 1

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)