Breaking News

ఫ్యామిలీ ఫార్మింగ్‌ : విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ

Published on Wed, 11/13/2024 - 10:36

ప్రకృతి వ్యవసాయ పద్ధతులను హైస్కూలు నుంచి యూనవర్సిటీ స్థాయి వరకు విద్యార్థులకు అలవాటు చేయటం ఎంతో అవసరమనే విషయంతో ఇప్పుడు ఏకీభవించని వారు బహుశా ఎవరూ ఉండరు. రసాయనిక అవవేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తి ద్వారానే మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. అయితే, ఈ బృహత్‌ కార్యక్రమాన్ని వ్యాప్తిలోకి తేవటానికి విద్యాసంస్థలతో కలసి పనిచేస్తూ స్ఫూర్తిని నింపుతూ విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పనులను అలవాటు చేయటంలో ప్రత్యక్ష కృషి చేస్తున్న వారిని వేళ్లపై లెక్కించవచ్చు. ఈ కోవలో మొదటి పేరు డాక్టర్‌ గంగాధరం. 

దాదాపు రెండు దశాబ్దాలుగా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక శిక్షణ ద్వారా విశేష కృషి చేస్తున్న ప్రకృతి సేద్య ప్రేమికుడు డాక్టర్‌ వర్డ్‌ గంగాధర్‌. ఇప్పటికే వేలాది మంది రైతులకు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఘనత వర్డ్‌ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తిరుపతికి చెందిన డాక్టర్‌ ఎం గంగాధర్‌కే దక్కుతుంది. 

తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే పద్ధతులను ఆయన గత కొన్ని నెలలుగా నేర్పిస్తున్నారు. 20 అడుగుల వెడల్పు “ 20 అడుగుల ΄÷డవు విస్తీర్ణంలో చిన్న చిన్న ఎత్తుమడులు ఏర్పాటు చేసి విద్యార్థుల చేత 15 రకాల ఆకుకూరలు, 4 రకాల కూరగాయల సాగు చేయిస్తున్నారు. ఈ నమూనాకు కుటుంబ వ్యవసాయం (ఫ్యామిలీ ఫార్మింగ్‌) అని పేరు పెట్టారు. డాక్టర్‌ గంగాధరం యూనవర్సిటీలో కొందరికి ముందుగానే శిక్షణ ఇచ్చి ‘గ్రీన్‌ టీమ్‌’లను ఏర్పాటు చేశారు. డా. గంగాధరం మార్గదర్శకత్వంలో ఈ గ్రీన్‌ టీమ్‌ల ఈ కుటుంబ వ్యవసాయాన్ని పర్యవేక్షిస్తున్నారు. గ్రీన్‌ టీం సభ్యులు ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులను ఇంటింటల కుటుంబ వ్యవసాయ నమూనా మడుల దగ్గరకు ఆహ్వానించి వారికి అవగాహన కల్పిస్తున్నారు.

ప్రకృతి సేద్య వ్యాప్తికి దోహదం
ఈ ఫ్యామిలీ ఫార్మింగ్‌ నమూనా ముఖ్య ఉద్దేశం గురించి వివరిస్తూ డా. గంగాధరం (98490 59573) ఇలా అన్నారు.. ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆరోగ్యకరమైన 15 రకాల కూరగాయలను  ఏ విధంగా సాగు చేయవచ్చో నేర్పిస్తున్నాం.  ఈ నమూనా ద్వారా విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ పూర్తిస్థాయిలో నమూనాపై అవగాహన తెచ్చుకోగలుగుతారు. వివిధ  ప్రాంతాలలో వారి సొంత  పొలాల్లో కూడా కొంచెం విస్తీర్ణంలో అయినా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేయటం  ప్రాంరంభిస్తారు. ఆ విధంగా గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ప్రాంచుర్యానికి ఎంతో దోహదపడుతుంది. అట్లే తిరుపతి పట్టణంలో ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఆశాభావం..’ అన్నారు.  (గార్బేజ్‌ ఎంజైమ్‌ : పండ్లు, కూరగాయ మొక్కలకు ఈ ద్రవం ఇచ్చారంటే!)

తిరుపతి పట్టణంలోని ప్రజలు కూడా సాయంత్రం 4–5 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో  పాల్గొనవచ్చని, తమ ఇంటి వద్ద తక్కువ స్థలంలో వివిధ రకాల కూరగాయలు సాగుచేసే పద్ధతులను తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో యువత విశ్వవిద్యాలయం నుంచి హైస్కూల్‌ వరకు ఈ నమూనా వ్యాప్తి చెంది రాష్ట్రమంతా యువత ప్రకృతి వ్యవసాయంపై పట్టు సాధించగలరని భావిస్తున్నానన్నారు. ఈ కృషి ఫలించాలని ఆశిద్దాం.

 


 


డా. గంగాధరం

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)