ముఖంపై వెంట్రుకలు పెరుగుతున్నాయా?

Published on Sun, 04/05/2026 - 11:02

నాకు పద్దెనిమిది సంవత్సరాలు. ఇటీవల పైపెదవి, గడ్డం కింద ఒత్తుగా, దట్టంగా వెంట్రుకలు వస్తున్నాయి. బరువు కూడా పెరుగుతోంది. ఇది ఏ సమస్యకు సంకేతం? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?
– మమత, జమ్మలమడుగు. 

మీరు చెప్పిన లక్షణాలను బట్టి ఇది హిర్సూటిజం (అనవసరంగా వెంట్రుకలు పెరగడం) అనే సమస్య కావచ్చు. సాధారణంగా మహిళల్లో పై పెదవి, గడ్డం, ఛాతీ, వెన్ను వంటి ప్రాంతాల్లో మందంగా, నల్లగా వెంట్రుకలు పెరగడం ఈ సమస్య లక్షణం. ఇది ఎక్కువగా శరీరంలో పురుష హార్మోన్లు (ఆండ్రోజెన్స్‌) అధికంగా ఉండటం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు అడ్రినల్‌ గ్రంథుల సమస్యలు, అరుదుగా ట్యూమర్లు కూడా కారణం కావచ్చు. ఈ సమస్యను నిర్ధారించడానికి గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.

 డాక్టర్‌ ముందుగా పూర్తి శరీర పరీక్ష చేస్తారు. అవసరమైతే కొన్ని రక్తపరీక్షలు, హార్మోన్‌ టెస్టులు, అలాగే అల్ట్రాసౌండ్‌ స్కాన్‌  ద్వారా ఓవరీల పరిస్థితిని పరిశీలిస్తారు. చికిత్స సమస్య తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. హార్మోన్లను సరిచేసే మందులు, బరువు తగ్గించే చర్యలు. అవసరమైతే కాస్మెటిక్‌ ట్రీట్మెంట్స్, లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ వంటి జీవనశైలిలో మార్పులు చాలా ముఖ్యం. చక్కెర, స్వీట్స్, జంక్‌ ఫుడ్, ఆయిల్‌ ఫుడ్‌ తగ్గించడం, నియమిత వ్యాయామం చేయడం ద్వారా బరువు నియంత్రణలో ఉంచాలి. 

ఇది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, మానసికంగా కూడా ప్రభావం చూపొచ్చు. కొంతమందిలో ఆత్మవిశ్వాసం తగ్గడం, ఆందోళన వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఈ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిది. సరైన వైద్య చికిత్సతో పాటు అవసరమైతే లేజర్‌ వంటి పద్ధతుల ద్వారా వెంట్రుకలను తగ్గించుకోవచ్చు. దీంతో జీవన నాణ్యత మెరుగుపడుతుంది. 

డా‘‘ భావన కాసు
గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌
హైదరాబాద్‌ 


∙ 

#

Tags : 1

Videos

నువ్వు ఏడ్చే రోజు దగ్గర్లోనే ఉంది.. ABN రాధాకృష్ణను ఏకిపారేసిన నాగార్జున యాదవ్

విశాఖ జిల్లాలో యువకుడి ప్రాణం తీసిన క్రికెట్

దళితుడుపై చెయ్యి చేసుకున్నాడు.. అయ్యన్నపాత్రుడు చెంప చెళ్లుమనిపించిన సుధాకర్ బాబు

నా తండ్రిని నేను చంపుకుంటానా.. పేర్ని నాని ఎమోషనల్

దువ్వాడలో దారుణం.. మహిళ ఇంటికి నిప్పు పెట్టిన దుండగుడు

చిల్లర చేతిలో పెట్టి మెడలో చైన్ లాక్కెళ్లిన దొంగోడు

5 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం

ఇరాన్, అమెరికా బాంబుల వర్షం.. ఒక్కడి కోసం సమస్త సైన్యం

లోకేష్ ను నమ్మి మోసపోయా

విడాకులు రాగానే సంబరాలు.. డప్పులతో బిడ్డకు స్వాగతం

Photos

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)

+5

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్‌ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో దర్శకుడు అట్లీ భార్య (ఫోటోలు)

+5

సింహాచలం : దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..? (ఫొటోలు)