చర్మం లోతుల్లోంచి క్లీన్‌ చేసే..క్లెన్సింగ్‌ బ్రష్‌..!

Published on Sun, 08/03/2025 - 09:33

చర్మాన్ని లోతుగా, సున్నితంగా శుభ్రపరచడానికి, ఎల్లవేళలా తాజాగా ఉంచడానికి సహకరిస్తుంది ఈ సూపర్‌ ఫేషియల్‌ వైబ్రేటింగ్‌ క్లెన్సింగ్‌ బ్రష్‌. దీనితో కేవలం క్లీనింగ్‌ మాత్రమే కాకుండా, మరెన్నో ప్రయోజనాలున్నాయి. ఈ అధునాతన బ్రష్‌ సున్నితమైన మైక్రో–వైబ్రేషన్‌లను అందిస్తుంది. ఇది చర్మంపై ఉండే మలినాలను పూర్తిగా తొలగిస్తుంది. అంతేకాకుండా, రక్తప్రసరణను ఉత్తేజపరుస్తుంది.

యాంటీ బ్యాక్టీరియల్‌ సిలికన్‌తో తయారైన ఈ బ్రష్‌ రీచార్జబుల్‌ కావడంతో వినియోగించుకోవడం చాలా తేలిక. దీనికి మూడు వైబ్రేషన్‌ మోడ్‌లు (డీప్‌ క్లెన్సింగ్, మసాజింగ్, స్కిన్‌ స్టిమ్యులేటింగ్‌) ఉండటంతో దీనిని చర్మ సంరక్షణ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. ఎర్గనామిక్‌ డిజైన్‌ ఉన్న ఈ మినీ డివైస్‌ ఆటో–కాంటారింగ్‌ హెడ్‌తో ప్రత్యేకంగా రూపొందింది.

మేకప్‌ తొలగించిన తర్వాత, ఈ బ్రష్‌ను తడిపి, నచ్చిన క్లీనింగ్‌ లోషన్‌ లేదా క్రీమ్‌ని కొద్దిగా బ్రష్‌కు పూసి అప్లై చేసుకోవాలి. రెండు సెకన్ల పాటు బటన్‌ను నొక్కి ఉంచితే క్లెన్సింగ్‌ మోడ్‌ యాక్టివేట్‌ అవుతుంది. ఆ ఆప్షన్‌తో పరికరం ఆటోమేటిక్‌గా ఆగిపోయే వరకు చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు. మసాజ్‌ కోసం, బ్రష్‌ను తిప్పి, బటన్‌ను 2 సెకన్ల పాటు నొక్కి పట్టుకుంటే సరిపోతుంది. అప్పుడే కొన్ని చుక్కల ఫేషియల్‌ ఆయిల్‌ అప్లై చేసుకుంటే, ఈజీగా మసాజ్‌ చేసేస్తుంది. చేతిలో ఇమిడిపోయే ఈ మినీ టూల్‌ సౌందర్య ప్రియులకు చక్కగా ఉపయోగపడుతుంది.

నిండైన పెదవులకు మెండైన చికిత్స
ఈ రోజుల్లో దొండపండులాంటి నిండైన పెదవుల కోసం అట్టే శ్రమించనక్కర్లేదు. కావాలనుకుంటే, ఇట్టే పొందవచ్చు. ‘ఇంజెక్టబుల్‌ లిప్‌ ఫిల్లర్స్‌’ అనే కాస్మెటిక్‌ చికిత్సతో కోరిన పెదవులను సొంతం చేసుకోవచ్చు. 

జన్యుపరంగా పెదవులు సన్నగా ఉన్నవారికి ఈ చికిత్స మంచి అవకాశమనే చెప్పుకోవాలి. ఈ ఫిల్లర్లలో సాధారణంగా హైయలురోనిక్‌ యాసిడ్‌  ఉంటుంది. ఇది చర్మానికి సహజంగా తేమను అందించి, పెదవులు నిండుగా కనిపించేలా చేస్తుంది. ఈ చికిత్సలో, ముందుగా పెదవులకు మత్తు ఇస్తారు. ఆపై సన్నని సూదితో ఫిల్లర్‌ను పెదవి లోపలికి జాగ్రత్తగా ఇంజెక్ట్‌ చేస్తారు. 

ఇది పెదవుల పరిమాణాన్ని పెంచడమే కాకుండా, వాటి ఆకృతిని మెరుగుపరచడానికి, చిన్న చిన్న ముడతలను తగ్గించడానికి సహాయపడుతుంది. చికిత్స తర్వాత కొద్దిపాటి వాపు కనిపిస్తుంది. కానీ అదంతా కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. ఈ లిప్‌ ఫిల్లర్ల ప్రభావం సుమారు 6 నుంచి 12 నెలల వరకు ఉంటుంది. అర్హత కలిగిన వైద్య నిపుణులతో మాత్రమే ఈ చికిత్స చేయించుకోవడం క్షేమం. 

(చదవండి: చిరునవ్వే సిగ్నేచర్‌ లుక్‌!)

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)