Breaking News

టియర్‌ గ్యాస్‌ అంటే ఏమిటి? 

Published on Sat, 08/01/2026 - 01:08

పోలీసులు గుంపులను చెదరగొట్టడానికి వాడే ‘టియర్‌ గ్యాస్‌’ నిజానికి గ్యాస్‌ కాదు. అది ఒక రకమైన రసాయన పొడి. దీనిని చిన్న చిన్న గ్రెనేడ్లు లేదా షెల్స్‌ రూపంలో గాల్లోకి కాలుస్తారు. అలా కాల్చినప్పుడు అది గాల్లో కలిసిపోయి దట్టమైన పొగలాగా మారుతుంది. ఇందులో ఎక్కువగా ’సీఎస్‌’ అనే కెమికల్‌ను ఉపయోగిస్తారు. ఈ పొగ మన ముఖానికి తగలగానే, అందులోని రసాయనాలు మన కళ్లు, ముక్కు, నోరు, ఊపిరితిత్తులలో ఉండే తేమ తో చర్య జరుపుతాయి. 

ముఖ్యంగా మన కళ్లల్లో ఉండే నరాలను ఇది తీవ్రంగా ఉత్తేజపరుస్తుంది. దాంతో కళ్లు విపరీతంగా మంటలు పుట్టి,  ప్రాణం విలవిల్లాడిపోతుంది. ఆ మంట నుంచి కళ్లను కాపాడుకోవడానికి మన మెదడు వెంటనే స్పందించి, కళ్లల్లోంచి కన్నీళ్లను వరదలా పారేలా చేస్తుంది. అందుకే దీనికి ‘బాష్పవాయువు’ అని పేరు వచ్చింది. దీనివల్ల కళ్లు తాత్కాలికం గా మూతపడతాయి, ముక్కు కారుతుంది, విపరీతంగా దగ్గు వస్తుంది. 

అయితే ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. ఆ పొగ నుంచి దూరంగా జరిగి, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ, కళ్లను మంచి చల్లటి నీటితో కడుక్కుంటే ఓ 15 నుంచి 20 నిమిషాల్లో దీని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. శాంతిభద్రతలను కాపాడటానికి, ఎవరికీ పెద్దగా గాయాలు అవ్వకుండా గుంపులను కంట్రోల్‌ చేయడానికి పోలీసులు వాడే ఒక సైన్స్ ట్రిక్‌ ఇది!
 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)