Breaking News

ఆరోగ్యానికి అదే మార్గం..!

Published on Thu, 04/17/2025 - 09:51

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి ప్రధానమని జాతీయస్థాయిలో పేరొందిన న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి అన్నారు. ఇండియన్‌ డైటెటిక్‌ అసోసియేషన్‌ తెలంగాణ చాప్టర్, ఆల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియాతో కలిసి నగరంలోని తాజ్‌ డెక్కన్‌లో పోషకాహారంపై నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన ఆహారంతో పాటు చురుగ్గా ఉండటం కూడా చాలా అవసరం అన్నారు. వ్యాయామానికి ముందు తర్వాత తీసుకునే ఆహారం చాలా కీలకమని, కొవ్వులు, ఆహారంలో ఫైబర్, జింక్, మెగ్నీషియం వంటి 15 ముఖ్యమైన పోషకాలతో నిండిన బాదం వంటి పప్పులు మేలు చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. 

ఈ సదస్సులో భాగంగా జరిగిన చర్చలో అపోలో హాస్పిటల్స్‌ చీఫ్‌ డైటీషియన్‌ హరితా శ్యామ్, యశోద హాస్పిటల్స్‌ చీఫ్‌ డైటీషియన్‌ సునీతా ఫిలిప్, స్టార్‌ హాస్పిటల్‌ చీఫ్‌ డైటీషియన్‌ నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 

జోరుగా.. హుషారుగా..
శాస్త్రిపురం: వేసవిలో పచ్చని పార్కులు ఆహ్లాదాన్నిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నారులు పార్కుల్లో సందడి చేస్తున్నారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని పార్కులలో జీహెచ్‌ఎంసీ అధికారులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఓపెన్‌ జిమ్‌తో పాటు చిన్నారుల కోసం ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. దీంతో పార్కుల్లో చిన్నారులు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. ఏ పార్కు చూసినా పిల్లలు, వృద్ధులు, మహిళలతో కళకళలాడుతున్నాయి. 

(చదవండి: నీడ పట్టున ఉండొద్దు..నిత్యం కాస్త ఎండ తగలాల్సిందే..! హెచ్చరిస్తున్న వైద్యులు)

 

#

Tags : 1

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)