Breaking News

జుట్టుకు హెన్నా పెడుతున్నారా?ఈ తప్పులు అస్సలు చేయకండి

Published on Sat, 11/25/2023 - 12:21

మెహందీలో ఇవి కలిపితే... 

►జుట్టుకు మెహందీ పెట్టుకునేటప్పుడు అరటిపండుని కలిపితే కురులకు మరిన్ని పోషకాలు అందుతాయి. అరటిపండులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ మాడు దురదను తగ్గిస్తాయి. అరటిపండుని మెత్తగా చిదుముకుని మెహందీలో వేసి కలపాలి. ఈ మెహందీని జుట్టుకి పట్టించి గంట తరువాత కడిగేయాలి. 

► కొబ్బరిపాలను కొద్దిగా వేడి చేసి కొన్ని చుక్కలు ఆలివ్‌ ఆయిల్‌ను వేసి కలపాలి. ఈ పాలను మెహందీలో వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. గంట తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే... కొబ్బరి పాలలోని లారిక్‌ ఆమ్లం మంచి యాంటీబయోటిక్‌గా పనిచేసి, మాడు సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. కండీషనర్స్, షాంపులలో కొబ్బరిపాలను వాడతారు. ఇలా మెహందీలో కొబ్బరిపాలు కలపడం వల్ల మెహందీ మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది. 

►టేబుల్‌ స్పూను హెన్నా, టేబుల్‌ స్పూను ముల్తానీ మట్టిని తీసుకుని నీటిలో నానబెట్టి పేస్టులా చేయాలి. ఈ పేస్టుని తలలో బాగా దురదపెడుతోన్న భాగంలో రాసి, అరగంట తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది. 

హెన్నా రాసేముందు ఈ తప్పులు చేస్తున్నారా?

  • మెహందీ అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుందని అందరూ అనుకుంటారు. కానీ, ఇది ఎలా అప్లై చేయాలి? ఎంత సమయం పెట్టాలో తెలియక చాలామంది తప్పులు చేస్తుంటారు. మెహందీని అప్పటికప్పుడు కలుపుకోకుండాముందు రోజు రాత్రే కనీసం 4-5 గంటల పాటు స్టోర్‌ చేసుకోవాలి. 
  • ఇక హెన్నాను జుట్టుపై ఎంత ఎక్కువసేపు ఉంచితే, అంత బాగా జుట్టు ఆరోగ్యంగా మారుతుందని అందరూ అనుకుంటారు.కానీ, ఇలా ఎక్కువ సేపు ఉంచితే, హెన్నా జుట్టులోని తేమను గ్రహిస్తుంది. జుట్టు విపరీతంగా పొడిగా మారుతుంది. హెన్నా వల్ల స్కాల్ప్ బ్లాక్ అయ్యే సమస్య కూడా ఉంటుంది. కాబట్టి 1-2 గంటలకు మించి పెట్టరాదు. 
     

  • చాలామంది పొడి జుట్టు మీదే మెహందీని పెడుతుంటారు. ఇలా అస్సలు చేయొద్దు. దీని వల్ల జుట్టు మరింత డ్రైగా కనిపిస్తుంది. రంగు కూడా బాగా కనిపించదు. దీని కోసం, ముందుగా హెయిర్ కండీషనర్‌ని వాడండి, ఆపై మీ జుట్టుకు అప్లై చేయండి. దీనివల్ల జుట్టు పొడిగా మారదు. అలాగే, మెహందీని అప్లై చేసిన తర్వాత మీకు ఎలాంటి సమస్య ఉండదు.
  • కొంతమందికి హెన్నా పడకపోవచ్చు. కానీ, ఇది జుట్టు రాలడం, అలెర్జీలకు దారితీయవచ్చు. అందువల్ల,జుట్టుకు రాసేముందే కాస్తంత హెన్నాను తీసుకొని చర్మంపై రాసి ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవాలి.

  •  మెహందీ వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని కొందరు వారం రోజులకు ఒకసారి కూడా పెడుతుంటారు. అలా అస్సలు చేయొద్దు. హెన్నాను నెలకు ఒకసారి మాత్రమే అప్లై చేయాలి. అతిగా వాడొద్దు.

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)