Breaking News

ఈ రాతగాళ్లు సవ్యసాచులు

Published on Thu, 04/03/2025 - 04:26

రెండు చేతులతో సంపాదించే వాళ్లను చూశాం కానీ.. రెండు చేతులతో రాసేపిల్లల్ని చూడాలంటే మధ్యప్రదేశ్‌ వెళ్లాల్సిందే. సింగ్రౌలీ జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలోని బుధేలా గ్రామంలో వీణావాదిని పబ్లిక్‌ స్కూల్‌ ఉంది. 1999 జూలై 8న ఈ పాఠశాలను స్థాపించారు. ఇక్కడి విద్యార్థుల ప్రత్యేకత ఏమిటంటే ఒకేసారి ఐదు భాషల్లో రెండు చేతులను ఉపయోగించి రాయగలరు. 

ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ ద్విచేతి విద్యలో ఆరితేరారు. హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, ఉర్దూ, స్పానిష్‌ భాషల్లోప్రావీణ్యులు. అలాంటి శిక్షణ పొంది ఇప్పటివరకు 500 మందికి పైగా ఉత్తీర్ణత సాధించారు.. ఇది భారతదేశంలోనే తొలి సవ్యసాచి పాఠశాలగా గుర్తింపు పొందింది.

మహాత్మాగాంధీ, మదర్‌ థెరిస్సా, ఆల్బర్ట్‌ ఐన్ స్టీన్, రతన్ టాటా, బిల్‌గేట్స్, సచిన్  టెండుల్కర్, బరాక్‌ ఒబామా వంటి ప్రముఖులు ఎడమ చేత్తో రాసేవారు. పూర్వ రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ రెండు చేతులతో రాయగల నేర్పరి. ఆయన స్ఫూర్తితో తమ విద్యార్థులకు ఈ సృజనను నేర్పినట్లు ప్రిన్సిపాల్‌ వృంగద్‌ శర్మ అంటారు. తొలుత సైనికుడిగా ఉన్న ఆయన రాజీనామా చేసి ద్విచేతి విద్యలో శిక్షణ పొందారు. 

అప్పుడే ఈ పాఠశాలను నెలకొల్పి చిన్న వయసు విద్యార్థులకు రెండు చేతులతో రాయడం నేర్పించడంప్రారంభించారు. నిరంతర సాధనతో ఈ పాఠశాల విద్యార్థులు కేవలం 11 గంటల్లో 24 వేల పదాలు రాయగలరు. రెండు చేతులతో రాయడం వల్ల గుర్తుంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. సమయం కూడా ఆదా అవుతుంది. దీన్ని ఆధ్యాత్మిక సాధనగా ఆయన అభివర్ణించారు. యోగ, ధ్యానం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అందుకే రోజూ గంట సేపు స్కూల్లో వీటిని సాధన 
చేయిస్తారు.

అనువాద బ్రహ్మలు
విద్యార్థులు ఒకటి నుంచి 100 పదాలు ఉర్దూలో 45 సెకన్లు, రోమన్ లో ఒక నిమిషంలో, దేవనాగరి లిపి ఒక నిమిషంలో రాయగలరు. ఒక నిమిషంలో రెండు భాషల నుంచి 250 పదాలను అనువదించగలరు. నిమిషంలో 17 పదాల వరకు రాయగలరు. వారికి ఒక చేత్తో రెండు పదాల పట్టికను, మరో చేత్తో మూడు పదాల పట్టికను రాస్తే సత్తా ఉంది.

కొంతమంది పిల్లలను పలకరించినప్పుడు వారు తమ అనుభవాలను పంచుకున్నారు. మూడోతరగతిలో ఉన్నప్పుడు కుడిచేత్తోనే రాసేవారట. తర్వాత ఎడమచేతి వాటం నేర్చుకున్నారు. ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఒకేసారి రెండు చేతులతో.. అది కూడా ఐదు భాషలను మార్చి మార్చి రాసేప్రావీణ్యతను సంపాదించినట్లు చె΄్పారు. మానవ మెదడు రెండు భాగాలుగా విభజించి ఉంటుంది. ఆ రెండింటినీ ఒకేసారి ఉపయోగించగలిగేలా ఉపాధ్యాయులు పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అందుకే ఏకకాలంలో రెండు చేతులతో రాయగలరని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు.

– చెన్నాప్రగడ శర్మ 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)