Breaking News

'మిరాకిల్ సీట్ 11A'..! కూర్చోవడానికి ఇష్టపడరు ఎందుకంటే..?

Published on Fri, 06/13/2025 - 16:06

విమానంలో ఎవ్వరు ఇష్టపడని 11A సీటు ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా ప్రమాద ఘటనతో ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది. యావత్‌ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన ఈ భయానక విమాన ప్రమాద ఘటనలో 241 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు ప్రాణాలతో బయటపడానికి కారణం ఎకానామీ క్లాస్‌లో విమాన రెక్కల ముందు వరసులో ఉండే 11A విండ్‌ సీటు అని, దీని వెనుకే ఎమర్జెన్సీ డోర్‌ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో నెట్టింట ఈ సీటు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సీటుని విమానంలో ఎవ్వరు ఇష్టపడని చెత్త సీటుగా చెబుతుంటారు. అంతలా ఇష్టపడని 11A సీటు ఆ ప్రమాద ఘటనలో ఒకేఒక్కడిగా ప్రాణాలతో బయటపడ్డ ఆ వ్యక్తి కారణంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. మరీ ఆ సీటు స్పెషాలిటీ..? ఎందుకు చెత్తసీటుగా ప్రయాణికులు భావిస్తారు..?

అహ్మ‌దాబాద్‌లో గురువారం మ‌ధ్యాహ్నం జ‌రిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమాన ప్ర‌మాదం నుంచి ర‌మేశ్ విశ్వాస్ కుమార్ అనే ప్ర‌యాణికుడు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. అతడు విమానంలో 11ఏ సీటులో కూర్చొన్నాడు. ఇది అతడి పాలిట వరమై ప్రాణాలతో బయటపడ్డ మృత్యుజయుడిలా యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. 

మొత్తం 241 మంది ప్రాణాలు బలిగొన్న ఆ భయానక విమాన ప్రమాదం నుంచి ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డ ఏకైక భారత సంతతి బ్రిటిష్‌ వ్యక్తిగా ర‌మేశ్ విశ్వాస్ కుమార్ నిలిచారు. దాంతో ఒక్కసారిగా 11ఏ కాస్తా మిరాకిల్‌ సీటుగా మారిపోయింది. బాధితుడు రమేష్‌ సైతం ఇంటర్వ్యూలో ఎలా బతికానో నాకు తెలియదని చెప్పాడు. దేవుని దయ వల్ల బయటపడ్డా..ఎందుకంటే ఆ ఘటనలో తాను కళ్లు తెరిచి చూసేటప్పటికీ.. తాను బతికే ఉన్నానని గుర్తించానని అన్నాడు. 

ఆ క్షణంలో గేటు విరిగిపోయి ఉండటం చూశానని, అక్కడ చిన్న గ్యాప్‌ ఉందని, దాని గుండా దూకానని చెప్పుకొచ్చాడు రమేష్‌. బోయింగ్ 787 సీటింగ్ కాన్ఫిగరేషన్ ప్రకారం, సీట్ 11A అనేది స్టాండర్డ్ ఎకానమీ ఎగ్జిట్ రో సీటు. అలాంటి సీటులు సాధారణంగా వొంపు తిరిగి  ఉంటాయి, అందువల్ల ప్రయాణికులు ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారనేది నిపుణుల అభిప్రాయం. బహుశా అదే అతడి ప్రాణాలను కాపాడి ఉండొచ్చు. కానీ బోయింగ్‌ 787లో ఈ 11Aని అత్యంత చెత్త సీటుగా ప్రయాణికులు భావిస్తారట.

రీజన్‌ ఏంటంటే..
'ది విండో సీట్ 11A' అనేది కిటికీ లేని విండో సీటుగా ప్రసిద్ధి చెందినది. ఎయిర్ కండిషనింగ్ డక్ట్‌లు లేదా స్ట్రక్చరల్ రీన్‌ఫోర్స్‌మెంట్‌ల వంటి అంతర్గత భాగాల స్థానం కారణంగా, కొన్ని సీట్లు ముఖ్యంగా 9A, 10A, 11A, 12A వంటి రెక్క ముందు భాగంలో ఉన్న సీట్లకు - పూర్తిగా కిటికీలు ఉండవు. ఇలా మరో బోయింగ్‌ 737-900 విమానంలో కూడా ఉంటుందట. చాలామంది ప్రయాణికులు ఈ సీటు గురించి ఫిర్యాదులు చేస్తారట. 

ఎందుకంటే..? బయట వ్యూ కోసం ఆశించే ప్రయాణికులకు ఇవి అత్యంత నిరుత్సాహపరిచే సీటులుగా చెబుతుంటారు. కిటీకీ లేకుండానే విండో సీటుగా పిలవడంతో చాలామంది ప్రయాణికులు పలుసార్లు ఇబ్బందులు పడ్డారట. అందుకే  ప్రయాణికులంతా ఈ 11A సీటంటే హడలిపోతారట. అస్సలు ఇష్టపడరట. పైగా దీన్ని విమానంలోనే అత్యంత చెత్త సీటుగా పరిగణిస్తారట. ఇప్పడు ఈ మృత్యుంజయడు రమేష్‌ విశ్వాస్ కుమార్ కారణంగా ఈ సీటుకి డిమాండ్‌ పెరిగి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారేమో అని నెట్టింట నెటిజన్లు కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతుండటం గమనార్హం.   

(చదవండి: Seat 11A: ఆ సీటులో ఉంటే భద్రమేనా?)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)