Breaking News

ఆలిం‘ఘనం’ ఆత్మీయం

Published on Mon, 03/10/2025 - 04:13

 మనుష్యుల మధ్య మాటల కన్నా స్పర్శ ఎన్నో అనుభూతులను, ఎన్నో సంగతులను చెబుతుంది. భావోద్వేగాలను తెలియజేయడానికి కౌగిలి ఒక శక్తిమంతమైన మాధ్యమంగా పనిచేస్తుంది. ప్రేమ, కృతజ్ఞతల నుంచి కోపం భయం వరకు స్పర్శ ద్వారా వ్యక్తీకరించబడిన భావోద్వేగాలను కౌగిలి, శబ్ద భాషకు మించిన సంబంధాన్ని పెంపొందిస్తుంది, అవగాహనను, సానుభూతిని ప్రోత్సహిస్తుంది.

శకుంతలను దుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకొని రాజ్యానికి వెళ్లిపోతాడు. కణ్వమహర్షి తన కూతురిని, మనుమడిని శిష్యులతో దుష్యంతుని దగ్గరకు పంపిస్తాడు. శకుంతల నిండు కొలువులో తానెవరో చెప్తుంది. కానీ దుష్యంతుడు మాత్రం వారి వివాహాన్ని అంగీకరించడు. ‘నీ కొడుకును పరిష్వంగం చేసుకో... అపుడు నీ కొడుకు అవునో కాదో తెలుస్తుంది’ అని చెప్తుంది. అంటే పరిష్వంగంలోని శక్తి అదన్నమాట.  

దమయంతిని దూరం చేసుకొని నలుడు మారుపేరుతో, దేశదేశాలు తిరిగి ఋతుపర్ణ మహారాజు దగ్గర కాలం గడుపుతుండేవాడు. దమయంతి బాహుకుని పేరుతో ఉన్న నలుడిని గుర్తించాలని తనకు ద్వితీయ వివాహం జరుగుతున్నట్లు ఋతుపర్ణ మహారాజుకు చెప్పి పంపిస్తుంది. ఆ వివాహానికి ఋతుపర్ణ రాజు నలుడిని అంటే బాహుకుడిని తన రథసారథిగా చేసుకొని దమయంతి దగ్గరకు వస్తారు. 

  బాహుకుని రూపంలో ఉన్న నలుని గుర్తించడానికి తన చెలికత్తె ద్వారా తన కూతురిని, కొడుకును వంటచేసుకొంటున్న బాహుకుడి దగ్గరకు  పంపుతుంది. ఆ పిల్లలను చూడగానే బాహుకుడు చేతులు చాపి వారిని అక్కున చేర్చుకుంటాడు. కంటతడి పెడ్తాడు. తండ్రీ పిల్లల ముఖకవళికలను చూసి దమయంతి ఆ వంటవాడే తన భర్త నలుడని గుర్తిస్తుంది. పిల్లల పరిష్వంగంలోని శక్తి అది అన్నమాటే కదా.

సీతమ్మ క్షేమవార్త చెప్పిన ఆంజనేయుడికి చేతులు చాపి గాఢ పరిష్వంగాన్ని రాముడు ఇచ్చాడు. లంకలో సీతమ్మను చూసి, రావణునిలో భయం కలిగించి, ధైర్యాన్ని సీతమ్మలో నింపి వచ్చిన  హనుమకి ప్రాణ సముడవు అని చెప్పడానికి రెండు చేతులు చాపి కౌగిలించుకున్నాడు రాముడు. పరిష్వంగం ద్వారానే రాముడు తన కుమారులుగా లవకుశులను గుర్తించినట్లు కొన్ని రామాయాణాల్లో కనిపిస్తుంది.
– ఆనంద‘మైత్రేయ’మ్‌ 
 

#

Tags : 1

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)