Breaking News

'దయ'కు అసలైన అర్థం..! హృదయాన్ని తాకే ఘటన..

Published on Thu, 04/17/2025 - 16:42

అందరివి బిజీ లైఫ్‌లు అయిపోయాయి. ఈ హడావిడి జీవితంలో జాలి, దయ దాక్షిణ్యాలకు చోటే లేకుండాపోయింది. ఎవరి స్వార్థం వారిది. అలా లేకపోతే వెనుకబడిపోతాం అనే ఫీల్‌కి వచ్చేశారు జనాలంతా. మన పొరిగింటివాడితోనే నాలుగు మాటలు కదపని వాళ్లం. ఇక ఇలాంటి వాటి ప్రసక్తే ఏం ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూస్తే..ఒక్కోసారి క్రూరంగా ప్రవర్తించే జంతువులు కూడా విచక్షణ జ్ఞానంతో మసులుకుంటాయాని తెలుస్తోంది. అంతలా దాడి చేయాలనుకుని ఒక్క క్షణం సంయమనంతో వ్యవహరించిన తీరు చూస్తే..ఆహా అడవిలో పెరిగినా.. ప్రకృతి ధర్మానికి కట్టుబడ్డాయి కదూ అనిపిస్తుంది. 

ఏం జరిగిందంటే..ఒక పెద్ద ఏనుగు ఒక గడ్డి మైదానంలో పిల్లలతో సేద తీరి ఉన్న సింహాన్ని చూసి దాడి చేసేందుకు వస్తుంది. అది చూసి సింహం ఆశ్చర్యపోతుంది. ఏం చేయాలో తోచదు. ఎందుకంటే దాని వద్ద ఉన్న చిన్న పిల్లలను వదిలి ఎలా వెళ్లాలో తెలియక ఒక్క నిమిషం అలా షాక్‌లో ఉండిపోతుంది. 

కొద్ది వ్యవధిలోనే తేరుకుని బాధతో ముగ్గురు పిల్లల్లో ఒక్క పిల్లనే నోట కరుచుకుని పారిపోతుంది. అయితే ఆ ఏనుగు కూడా అంత కోపంతో దాడి చేయడానికి వచ్చిందల్లా ఆ సింహం పిల్లలను చూసి కోపాన్ని తమాయించుకుని ఆగిపోయి వెనక్కి టర్న్‌ అవుతుంది. ముక్కుపచ్చలారని చిన్న పిల్లల జోలికి పోకూడదన్న ఆ ఏనుకు విచక్షణ తీరుకి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. 

దయ అనే పదానికి ఇది కదా అసలైన అర్థం అనిపిస్తుంది. మనుషుల తప్ప పశుపక్షాదులు, జంతువులు వీటిని పాటిస్తాయని పలు ఉదంతాలు నిరూపించాయి కూడా. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై ఓ లుక్కేయండి. 

 

(చదవండి: Kushboo Sundar: 20 కిలోలు తగ్గిపోయిన ఖుష్బూ.. అందుకోసం ఏం చేసిందంటే?)

 

Videos

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు