Breaking News

అలనాటి ఎలక్ట్రిక్‌ కారు

Published on Sun, 01/14/2024 - 05:50

ఎలక్ట్రిక్‌ వాహనాలు ఇప్పుడు మన దేశంలోనూ విరివిగా కనిపిస్తున్నాయి గాని, నిజానికి ఇవి వందేళ్లకు ముందు నుంచి కూడా వాడుకలో ఉన్నాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్నది అలనాటి ఎలక్ట్రిక్‌ కారు. దీనిని అమెరికన్‌ కార్ల తయారీ కంపెనీ ‘కొలంబియా’ విడుదల చేసింది. ‘కొలంబియా ఎలక్ట్రిక్‌ ఫేటన్‌’ పేరుతో ఈ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీని కొలంబియా కంపెనీ 1905లో ప్రారంభించింది. ఫొటోలో ఉన్న కారు 1908 నాటిది.

అప్పట్లో దీని ధర 1600 డాలర్లు (రూ.1.33 లక్షలు) ఉండేది. ఇప్పటి లెక్కల ప్రకారం దీని ధర 44,00 డాలర్లు (రూ.36.65 లక్షలు) ఉంటుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అప్పట్లో ఈ మోడల్‌ కారుకు విపరీతమైన గిరాకీ ఉండేది. ఈ కారుకు 24 బ్యాటరీలు పెట్టుకోవాల్సి వచ్చేది. వాటిని రీచార్జ్‌ చేసుకోవడానికి వీలయ్యేది. ఈ కారు ముందుకు పోవడానికి మూడు గేర్లు, వెనక్కు మళ్లడానికి రెండు రివర్స్‌ గేర్లు ఉండటం విశేషం.

దీనికి స్టీరింగ్‌వీల్, యాక్సిలేటర్‌ పెడల్‌ ఉండవు. కారుకు కుడి పక్కన తెడ్డులాంటి సాధనం అమర్చి ఉంటుంది. దిశను మార్చడానికి డ్రైవర్‌ దీనిని వాడాల్సి వచ్చేది. వేగాన్ని నియంత్రించడానికి ఎడమవైపు ఉండే కర్రలాంటి సాధనాన్ని వాడాల్సి వచ్చేది. ఇప్పటి తరానికి ఇది చాలా విచిత్రంగా కనిపించినా, ఈ కారు ఇంకా పనిచేసే పరిస్థితిలోనే ఉండటం విశేషం. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)