Breaking News

ఆంధ్రా రుచుల పండుగ..ఆ టేస్టే వేరేలెవల్‌..!

Published on Thu, 05/15/2025 - 11:15

హైదరాబాద్‌ నగరంలో ఎన్ని కాంటినెంటల్‌ వంటకాలున్నా తెలుగు రుచులకున్న ప్రత్యేకతే వేరు. వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి నగరానికి వచ్చే అతిథులు ప్రత్యేకంగా ఆంధ్రా వంటకాలను రుచి చూసే వెళతారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా నగరంలోని లీలా వేదికగా వివిధ సంస్కృతుల రుచులను నగరవాసులకు, అతిథులకు రుచి చూపిస్తు్తన్న ‘రీన్‌ – ది చెఫ్స్‌ స్టూడియో’ ఈ సారి ఆంధ్రా వంటకాలను ప్రదర్శిస్తోంది. 

ఎకోస్‌ ఆఫ్‌ ఆంధ్ర పేరుతో నిర్వహిస్తున్న ఈ ఫుడ్‌ ఫెస్ట్‌ ఈ నెల 18వ తేదీ వరకూ ఆంధ్రా పసందైన రుచులను చేరువచేస్తోంది. అంతేకాకుండా ప్రముఖ చెఫ్‌ ‘మీరా’ ఈ ఎకోస్‌ ఆఫ్‌ ఆంధ్ర ఫెస్ట్‌లో తన పాకశాస్త్ర నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత వేసవి నేపథ్యంలో తెలుగు రుచులతో విడదీయరాని అనుబంధమున్న మామిడి వంటకాలను సైతం ప్రత్యేకంగా వండివారుస్తున్నారు.  

‘ఎకోస్‌ ఆఫ్‌ ఆంధ్ర అనేది నా చిన్ననాటి ఆహారానికి నా ప్రేమలేఖ’..!! ఇవి నన్ను పెంచిన, లాలించిన రుచులు, తరతరాలుగా వారసత్వంగా వచ్చిన వంటకాలు. ప్రస్తుత తరుణంలో విభిన్న, వినూత్న రుచులుగా మోడ్రన్‌ డైనింగ్‌ టేబుల్‌ పైకి రావడం మళ్లీ ఇంటికి వెళ్లిన అనుభూతిని తీసుకువస్తుంది. 

ఆంధ్రా గొప్ప పాక సంప్రదాయాలకు గుర్తుగా రూపొందించిన క్యూరేటెడ్‌ థాలీని ఇక్కడ ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఇది ప్రతిష్టాత్మకమైన వారసత్వ వంటకాలను పునరుజ్జీవింపజేస్తుంది. ఈ ప్రాంతం ఆహార సంస్కృతిని ఇక్కడికి విచ్చేసే అతిథులకు చేరువ చేస్తూ ఆ ఘుమఘుమలను విశ్వవ్యాప్తం చేస్తున్నాం. ముఖ్యంగా మామిడి అంటే ఒక నోస్టాల్జిక్‌ అనుభూతి. 

ఈ వారసత్వ థాలీ కుటుంబాలు, పండుగలు భూమి లయల కథను చెబుతుంది. ఆనాటి పచ్చడి మొదలు నేటి కూరలు ఆధునిక రుచుల వరకూ సృషిస్తుంది ఈ వేదిక. ఈ పాప్‌–అప్‌ ద్వారా కాంటినెంటల్‌ వంటకాలను మైమరపించే రుచలను అందంచడమే లక్ష్యంగా రీన్‌ చెఫ్స్‌ స్టూడియో సిద్ధమైంది అని చెబుతున్నారు ప్రముఖ చెఫ్‌ మీరా 

(చదవండి: Parenting Tips: చిన్నారులకు ఈ వేసవిలో సేవ చేయడం నేర్పిద్దాం ఇలా..!)

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)