Breaking News

Easter 2025 పవిత్ర ఈస్టర్‌ సందర్భంగా ర్యాలీ

Published on Thu, 04/17/2025 - 13:22

గుడ్ ఫ్రైడే  మరియు  ఈస్టర్ సందర్భంగా ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయడం,  ఆయన పునరుత్థానం సందేశాన్ని గుర్తు చేసుకుంటూ  రన్‌ ఫర్‌ జీసస్‌ నిర్వహిస్తున్నారు. ఈస్టర్‌ పర్వ దినాన్ని పురస్కరించుకుని ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలుగు చర్చస్‌, అన్ని క్రైస్తవ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 19న నగరంలో భారీ ఎత్తున రన్‌ ఫర్‌ జీసస్‌ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు  ర్యాలీ ఆర్గనైజింగ్‌ కమిటీ వెల్లడించింది. కాథలిక్, ప్రొటెస్టంట్ చర్చిలను ఏకంచేస్తూ అతిపెద్ద క్రైస్తవ ర్యాలీని ‘రన్ ఫర్ జీసస్’ నిర్వహిస్తున్నామన్నారు. అన్ని చర్చిల నుండి వేలాది మంది క్రైస్తవులు కాలికనడక, రన్నింగ్‌,  మోటార్ సైకిళ్ళు/నాలుగు చక్రాల వాహనాలపై  ఆనందంగా ఈ ర్యాలీని నిర్వహిస్తారని తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో,​​శనివారం, ఏప్రిల్ 19,ఉదయం 6:00 గంటల నుండి హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాలలో  RUN FOR JESUS   ర్యాలీ జరుగుతుంది. హైదరాబాద్ ఆర్చ్‌డయోసెస్ ఆర్చ్ బిషప్ హిజ్ ఎమినెన్స్ కార్డినల్  పాల్‌ ఆంథోనీ, మెదక్ డయోసెస్ ఇన్‌ఛార్జ్ బిషప్ రెవరెండ్ డాక్టర్ కె. రూబెన్ మార్క్, అరదాన టీవీ చైర్మన్ బ్రదర్ పాల్ దేవప్రియం పుల్లా ,చర్చి మరియు,రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఇతర ప్రముఖులు నగరంలోని వివిధ ప్రదేశాలలో జరిగే ఈ పరుగులో పాల్గొంటున్నారు .చర్చిలు. స్థానిక సువార్త గాయకులు నిర్వహించే ప్రశంస మరియు ఆరాధనతో ఈ పరుగు ఆయా ప్రదేశాలలో గొప్ప ఆనందంతో ముగుస్తుందనీ సీనియర్ పాస్టర్లు ఈస్టర్ సందేశాన్ని అందిస్తారని నిర్వాహకులు తెలిపారు.  క్రైస్తవ సోదరులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ,సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ తీసుకురావాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.

ఒక ప్రత్యేకమైన సువార్తిక & క్రైస్తవ ర్యాలీ అయిన RUN FOR JESUS ​​యొక్క ఆలోచన మరియు భావనను 2011 సంవత్సరంలో అరదాన టీవీ బృందం రూపొందించి ప్రవేశపెట్టింది.  తొలుత ఇది  30కిపైగా ప్రదేశాల్లో  ఈ ర్యాలీని   చేపట్టారు. ప్రస్తుతం    RUN FOR JESUS ఏపీ, తెలంగాణాతో పాటు,  కర్ణాటక ,మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో ,విదేశాలలో కొన్ని ప్రదేశాలలో ఒక ప్రధాన వార్షిక క్రైస్తవ ర్యాలీగా మారింది.

 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)