Breaking News

దేవుడా! ఇలాంటి కష్టం పగవాడికి కూడా వద్దు: వైరల్‌ లెటర్‌

Published on Tue, 01/30/2024 - 14:39

ఈ భూప్రపంచంలో అమ్మను మించిన ప్రేమ దొరకదు. ఆ ప్రేమకు మరో ప్రత్యామ్నాయం లేదు. తన ప్రాణాలు పోతున్నా కూడా బిడ్డ క్షేమం గురించే ఆలోచిస్తుంది. ఈ విషయం అనేక సార్లు రుజువైంది. తాజాగా కేన్సర్‌తో చనిపోతూ తన కుమారుడికి రాసిన ఒక లేఖ ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. పలువురి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది.

రెడ్డిట్‌  యూజర్‌ మాట్ గాల్డ్ కేన్సర్‌తో చనిపోవడానికి ముందు తన తల్లి రాసిన ఒక లేఖను  పోస్ట్‌ చేశారు.  చని పోతానని తెలిసి తన కొడుకుపై ప్రేమను,  తన బాధను ఈ లేఖలో వ్యక్తం చేసింది ఆ మాతృమూర్తి.  ‘‘కన్నా నేను చనిపోతానన్న బాధకన్నా, నిన్ను విడిచి వెళ్లాలన్న ఆలోచన నా ప్రాణాల్ని తోడేస్తోంది.  నా తరువాత నిన్ను ఎవరు  చూసకుంటారు అనేదే  ఎక్కువ బాధగా ఉంది.   ఏదో ఒకరోజు నీకు ఇది దొరుకుతుందనే ఆశతో ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.  నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసని ఆశిస్తున్నాను.. నువ్వు నా బంగారు కొండవి.  మరే ఆదాయం రాదని తెలిసినా నాకోసం ఉద్యోగం మానేసి మరీ ఎంతో సేవ చేసావ్‌. నీతో గడిపిన  ప్రతీ క్షణం చాలా  అద్భుతం. ఎప్పుడూ నీతోనే రా..నాన్నా. ఆ పైనుంచి నిన్ను చూస్తూనే  ఉంటాను కన్నా.!"  అంటూ మాట్ గాల్డ్ చేసిన త్యాగాలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆమె  రాసిన లేఖ నెటిజన్లు భావోద్వేగానికి లోను చేసింది.  

‘‘ప్రతిరోజూ అమ్మను మిస్‌ అవుతున్నా.. ఏడుపొస్తోంది.  కానీ చిరునవ్వు మధ్య ఆ బాధనంతా దిగమింగుతున్నాను.  ఎందుకంటే నాన్న కూడా కేన్సర్‌తో బాధపడుతూ ఐసీయూలో ఉన్నారు.  ఆయన్ని చూసుకోవాలి’’  అంటూ  మాట్ గాల్డ్‌ రెడ్డిట్‌ పోస్ట్‌ లో రాసుకొచ్చారు.  దీంతో నెటిజన్లు సారీ బ్రో అంటూ  కమెంట్‌ చేశారు. నిజంగా  మీరు మంచి కొడుకు.. మీకు అంతా మంచి జరగాలని అని కొందరు,  అమ్మ ప్రేమ ఎపుడూ మీతోనే... తల్లీ కొడుకుల అనుబంధం ఎప్పటికీ శాశ్వతమే అని మరొకరు వ్యాఖ్యానించారు. మీ కోసం ఆమె కన్న కలలతోపాటు మీ కలలు కూడా నిజం కావాలి అంటూ మరికొందరు యూజర్లు అతనికి ఓదార్పునిచ్చారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)