Breaking News

రాజాధిరాజ.. రాజమార్తాండ.. బహుపరాక్‌!

Published on Tue, 09/23/2025 - 10:59

మైసూరు ప్యాలెస్‌లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. అంబా విలాస్‌ ప్యాలెస్‌లో మైసూరు రాజవంశస్తులు వైభవం అంబరాన్ని అంటింది. రాజవంశీకుడు, స్థానిక ఎంపీ యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయార్‌ బంగారు, రత్న సింహాసనం పైన 11వసారి ఆసీనులై దర్బార్‌ని నిర్వహించారు. ముత్యాలు పొదిగిన సంప్రదాయ పట్టు వస్త్రాలను ఆయన ధరించారు. గండభేరుండ చిహ్నంతో సహా పలు రకాల బంగారు ఆభరణాలతో మెరిసిపోయారు. 12:42 గంటల తరువాత శుభ ముమూర్తంలో రాజవంశానికి చెందిన ఖడ్గాన్ని పట్టుకొని సింహాసనాన్ని అధిష్టించారు.  

ఈ సందర్భంగా భటులు జయహొ మహారాజా అంటు నినాదాలు చేశారు. మంగళ వాయిద్యాలు మారుమోగాయి, రాజ మార్తాండ సార్వభౌమ, యదుకుల తిలక, యదువీర ఒడెయార బహుపరాక్‌ బహుపరాక్‌ అని గట్టిగా స్వాగత వచనాలు పలికారు.    

నవగ్రహ పూజ:
ముందుగా దర్బార్‌ ప్రాంగణానికి చేరుకున్న యదువీర్‌ అక్కడే నవగ్రహాలకు పూజలు చేశారు. కొంత సమయం సింహాసనంపై కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి త్రిషిక భర్తకు పాద పూజ చేశారు. ఆపై ఆయన అందరికీ నమస్కరించి ఆనాటి మహారాజుల తరహాలో దర్బార్‌ని నిర్వహించారు. 

చాముండికొండ, పరకాల మఠం, నంజనగూడు, మేలుకొటె, శ్రీరంగపట్టణ, శృంగేరిలతో పాటు 23 ఆలయాల నుంచి పురోహితులు తీసుకువచ్చిన పూర్ణ ఫల ప్రసాదాలను స్వీకరించారు. తరువాత పండితులకు చిన్న చిన్న కానుకలను అందజేశారు. అర్ధగంట సేపు దర్బార్‌ సాగింది. రాజమాత ప్రమోదా దేవి పాల్గొన్నారు.     

మైసూరు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొదటిరోజు సోమవారం నాడిన శక్తిదేవత చాముండేశ్వరి దేవి అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్త కోటికి దర్శనమిచ్చారు. 9 రోజులపాటు అమ్మవారిని రోజుకొక్క అవతారంలో అలంకరిస్తారు. వేలాదిగా భక్తులు దర్శించుకుని తరించారు.   

ఫలపుష్ప ప్రదర్శన 
మైసూరు దసరా ఉత్సవాలలో ఫలపుష్ప ప్రదర్శనను సీఎం సిద్దరామయ్య ప్రారంభించారు. కుప్పణ్ణ పార్క్‌లో ఏర్పాటైన ఈ ఫ్లవర్‌ షో అక్టోబరు 2వ తేదీ వరకు కొనసాగుతుంది. మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫల పుష్ప విన్యాసాలను తిలకించిన సిద్దరామయ్య సంతోషం వ్యక్తంచేశారు. ఉప్పు సత్యాగ్రహం మహాత్మాగాంధీ పోరాటం విగ్రహాలను చూసి వివరాలను తెలుసుకున్నారు. 

(చదవండి: నవరాత్రుల్లో అక్కడ దుర్గమ్మకి నైవేద్యాలుగా చేపలు, మాంసం..! ఎందుకంటే..)
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)