విదేశీ పూలతో వింతగా..!

Published on Tue, 09/30/2025 - 10:33

తెలంగాణలోనే అత్యంత ఖరీదైన బతుకమ్మను పేర్చి కూకట్‌పల్లికి చెందిన పలువురు అబ్బురపరుస్తున్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన గుండాల అర్చన విదేశాల నుంచి పూలను తెప్పించి గత మూడేళ్లుగా వింతగా బతుకమ్మను పేరుస్తున్నారు. 

మొదట తామర పువ్వు ఆకారంలోనూ, రెండో ఏడాది హంస ఆకారంలోనూ, ఈ ఏడాది ఏనుగు బొమ్మలతో కూడిన బతుకమ్మను పేర్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈసారి బతుకమ్మ కోసం థాయిలాండ్‌ ఆర్చిడ్స్, సింగపూర్‌ రోజెస్, బ్యాంకాక్‌ కాచెన్స్, బెంగళూరు బెజస్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ నుంచి జిప్సోమియా పూలను తెప్పించినట్లు చెబుతున్నారు. 

ఆకట్టుకున్న ‘భక్తి శక్తి’ 
నవరాత్రుల అర్థాన్ని బెంగళూరుకు చెందిన కూచిపూడి కళాకారులు నృత్యరూపకంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న సంగీత నృత్యోత్సవాలు– బతుకమ్మ సంబరాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు నాట్య గురువు వీణా మూర్తి విజయ్‌ శిష్య బృందం భక్తి శక్తి పేరిట ప్రదర్శించిన కూచిపూడి దృశ్యాంశాలు వీక్షకులను సమ్మోహన పరిచాయి. 

పవిత్ర జలం, రంగోలి, ధూపం, దీపం, జాజ్రాలతో వేదికను శుద్ధి చేసే నృత్యం ఆసక్తికరంగా సాగింది. అదేవిధంగా నర్తకి శ్యామక్రిష్ణ, జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నవదుర్గ తోలుబొమ్మలాట ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అలేఖ్య 
పుంజాల, ఆర్‌ వినోద్‌ కుమార్‌ పలువురు కళాకారులు పాల్గొన్నారు.  

(చదవండి: విరామ భోగ్‌‘: అక్కడ నైవేద్యాన్ని అమ్మవారే స్వయంగా..!)

Videos

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

కొండా రెడ్డి బురుజు సాక్షిగా దొరికిన బడి దొంగలు

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)