Breaking News

‘విరామ భోగ్‌‘: అక్కడ నైవేద్యాన్ని అమ్మవారే స్వయంగా..!

Published on Tue, 09/30/2025 - 09:41

సాధారణంగా అమ్మవారికి భక్తులు రకరకాల నైవేద్యాలను వండి ప్రసాదాలను సిద్ధం చేయడం సంప్రదాయం. అయితే ఇక్కడ మాత్రం అమ్మవారు తన నైవేద్యాన్ని తనకు నచ్చిన విధంగా తానే వండుకుంటుంది. అందుకోసం నాణ్యమైన సరుకులు, మసాలా దినుసులు, వంట చెరకు, వంటపాత్రలు సమకూరిస్తే సరి΄ోతుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా, పశ్చిమ బెంగాల్‌ ఝార్‌గ్రామ్‌లోని చిల్కిగఢ్‌ రాజభవనంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న సంప్రదాయం ఇది.

స్థానికంగా ‘విరామ భోగ్‌‘ అని పిలుచుకునే అష్టమి రోజున అమ్మవారు తనకు సమర్పించిన నైవేద్యాన్ని తానే స్వయంగా వండుతుందని నమ్ముతారు. చిల్కిగఢ్‌ రాజభవనంలో, అష్టమి పూజ పూర్తయిన తర్వాత, ఆలయ ప్రధాన పూజారి ఒక కొత్త మట్టి కుండలో నీరు, బలి మాంసం, ఇతర పదార్థాలను నింపుతాడు. పూజారి మేక బలి మాంసంతో ఏకాంతంగా వంటగదిలోకి ప్రవేశిస్తాడు. సంప్రదాయం ప్రకారం, మాంసాన్ని కొత్త మట్టి కుండలో ఉంచుతారు. దానిలో వివిధ మసాలా దినుసులు కలుపుతారు. 

తరువాత, మూడు కట్టెలను పొయ్యిలో ఉంచుతారు. ఆ మట్టి కుండను సాల్‌ చెట్టు ఆకులతో కప్పి, గదిలో పొయ్యిపై పెట్టి, కుండ పక్కన ఒక కొయ్య గరిటె ఉంచుతారు. పొయ్యిలో మూడు కట్టెలు వెలిగించిన తర్వాత, గది బయటి నుండి తాళం వేస్తారు. నవమి రోజు ఉదయం, పూజారి రాజభవనం నుండి తాళం తీసుకుని వచ్చి, ఆ వంటగది తలుపు తెరిచి చూసి, అమ్మవారికి ‘భోగ్‌‘గా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతాడు. 

అమ్మవారే స్వయంగా వచ్చి ఈ భోగ్‌ను వండుకుంటుందని విశ్వాసం. ఈ విషయాన్ని చిల్కిగఢ్‌ రాజ్‌బరి ప్రస్తుత వారసుడు తేజసచంద్ర దేవ్‌ ధబల్‌దేవ్‌ స్వయంగా తెలియజేశారు. అమ్మవారు తమ పూర్వికులకిచ్చిన సూచనల మేరకు ఈ విధంగా చేస్తున్నట్లు తెలియజేశారు.  

(చదవండి: వెయ్యేళ్ల నాటి ఆలయం..! ఇక్కడ దుర్గమ్మకు రక్తం చిందించని బలి..)

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌