Breaking News

మంచు పొరలపై బతుకమ్మ, దాండియా సంబరాలు

Published on Mon, 09/22/2025 - 10:46

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆట, పాటలతో బతుకమ్మను పూజిస్తారు. గుజరాతి, రాజస్థానీలు దుర్గాదేవిని పూజించే క్రమంలో దాండియా నృత్యాలు చేస్తారు. 

దసరా నవరాత్రుల సందర్భంగా కొండాపూర్‌ శరత్‌ సిటీమాల్‌లోని స్నో కింగ్డమ్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ, దాండియా సంబురాలను ఒకే వేదికపై చేపట్టారు. ముంచు కొండలు, మంచుతో కప్పిన ప్యాలెస్‌లు, బ్లాక్‌ సీల్స్, ఇగ్లూ, ఓక్‌ చెట్లు, దృవపు ఎలుగుబంట్ల సెట్ల మధ్య ఈ ఉత్సవాలను ఆదివారం ప్రారంభించారు. ఇవి 11 రోజుల పాటు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.   

రెండో రోజు బతుకమ్మ ప్రత్యేకత..
బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. ఒక్కో రోజు ఒక్కో విశిష్టత కలిగి ఉంది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా జరుపగా, రెండో రోజు అటుకుల బతుకమ్మ నిర్వహిస్తారు. రెండో రోజు రంగు రంగుల పూలతో బతుకమ్మను తయారు చేసుకుని గౌరమ్మను తయారు చేసుకుంటారు. 

అందులో గౌరమ్మను పెట్టి పూజిస్తారు. ఆరోజు అమ్మవారికి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం కూడా ఉంది. అందుకే అటుకులు బతుకమ్మ అని పేరు వచ్చింది.  తెలంగాణ ప్రజల సంస్కృతికి అద్దం పట్టేలా బతుకమ్మ వేడుకలు జరుపుతారు. 

రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరీదేవిగా భావించి మహిళలు జరుపుకునే పండుగే ఇది. తొమ్మిది రోజులపాటు ఈ వేడుకులు జరుగుతాయి. ఒకవైపు నవరాత్రులు, మరోవైపు బతుకమ్మను ఘనంగా జరుపుకొంటారు.   

(చదవండి: సరదా పాటలు..దాండియా ఆటలు..!)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)