Breaking News

దసరాలో తప్పక చూడాల్సిన ప్యాలెస్‌ ఇది..!

Published on Mon, 10/07/2024 - 13:56

మైసూర్‌ అంటేనే దసరా ఉత్సవాలు. దసరా అంటేనే మైసూర్‌లో జరిగే ఉత్సవాలు. ఇదీ ఒక్కమాటలో చెప్పాలంటే మైసూర్‌ టూర్‌. వడయార్‌ రాజకుటుంబీకులు మైసూర్‌ ప్యాలెస్‌లో సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహిస్తారు. దసరా ఉత్సవాల సందర్భంగా పబ్లిక్‌ను ప్యాలెస్‌లోకి అనుమతిస్తారు. ప్యాలెస్‌ లోపల వడయార్‌ కుటుంబీకులు ఉపయోగించిన వస్తువులు, నాటి హస్తకళాఖండాలుంటాయి. 

దర్బార్‌ హాల్‌లో బంగారు సింహాసనాన్ని చూడవచ్చు. ఆ రోజుల్లో అందంగా అలంకరించిన ఏనుగులు ఈ వేడుకలో ప్రత్యేకాకర్షణ. పది రోజుల పాటు ప్యాలెస్‌ ఆవరణలో సంగీత, నాట్య ప్రదర్శనలు జరుగుతుంటాయి. మైసూర్‌ ప్యాలెస్‌ని చూసిన తర్వాత కరంజి లేక్‌లో బోట్‌ షికారు చేసి, వన్యప్రాణుల మధ్య విహరించాలి. జయచామరేంద్ర ఆర్ట్‌ గ్యాలరీ, ఫిలోమినా చర్చ్‌ కోసం కూడా కొంత టైమ్‌ కేటాయించుకోవాలి. ఇక మైసూరు వంటలను రుచి చూడడంతోపాటు మైసూర్‌ సిల్క్‌ చీరలను కొనడంతో ట్రిప్‌ పరిపూర్ణమవుతుంది. పిల్లలతో వెళ్లిన వాళ్లు తప్పకుండా రైల్‌ మ్యూజియాన్ని కవర్‌ చేయాలి.

ఉదయాన్నే చూడాలి..!
మైసూర్‌ ప్యాలెస్‌లోకి పదిగంటలకు పర్యాటకులను అనుమతిస్తారు. ఆ సమయానికి పది నమిషాల ముందే చేరినట్లయితే జనం తక్కువగా ఉంటారు. పదిన్నర తర్వాత ప్రతి అరగంటకు జనసమ్మర్దం గణనీయంగా పెరుగుతుంది. తొమ్మిదింటికే చేరగలిగితే సూర్యకిరణాలకు మెరిసే ప్యాలెస్‌ సౌందర్యాన్ని కూడా వీక్షించవచ్చు. 

  • ప్యాలెస్‌ లోపల ఫొటోలు తీసుకోవడానికి అనుమతి ఉండదు. కెమెరాకు టికెట్‌ తీసుకున్నప్పటికీ కొన్నిచోట్ల మాత్రమే అనుమతిస్తారు 

  • పర్యాటకుల వస్త్రధారణ ప్యాలెస్‌ నియమాలకు లోబడి ఉండాలి. దుస్తులు భుజాలను కవర్‌ చేస్తూ, మోకాళ్ల కింద వరకు ఉండాలి ∙ 

  • ప్యాలెస్‌ లోపల కొన్ని చోట్లకు పాదరక్షలను అనుమతించరు. ఈ కాలం నేల చల్లగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు సాక్స్‌ వేయడం మంచిది 

  • పెద్దవాళ్లు ప్యాలెస్‌ మొత్తం నడుస్తూ చూడడం కష్టమే. సిద్ధంగా ఉంచిన వీల్‌ చైర్‌లను వాడుకోవచ్చు. గైడ్‌ చెప్పే ఆసక్తికరమైన, హాస్యపూరితమైన కథనాలను ఎంజాయ్‌ చేయవచ్చు 

  • ఆడియో గైడ్‌ సౌకర్యం ఉంది. దానికి చార్జ్‌ ఎక్కువనిపించినప్పటికీ తప్పకుండా ఆడియోలో ప్యాలెస్‌ గురించిన వివరాలను వింటూ తిలకించాలి 

  • రాత్రి లైట్‌ షో కూడా చూడాలి. ఆ షోకు కూడా ముందుగా వెళ్తే షో బాగా వీక్షించే  అవకాశం ఉంటుంది. 

(చదవండి: శరదృతువులో అక్కడ పడవులతో పండుగ సందడి..ఏకంగా..!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)