నవరాత్రి ప్రసాదాలు: పచ్చికొబ్బరితో లడ్డు

Published on Sat, 10/05/2024 - 10:04

దసరా నవరాత్రులు మొదలయ్యాయి.  అమ్మవారికి ప్రసాదాలు చేయాలి. ఆ ప్రసాదాలను పిల్లలు ఇష్టంగా తినాలి.   పొంగలి... పులిహోరకు తోడు ఇంకేం చేద్దాం. 

పచ్చికొబ్బరితో లడ్డు... మూంగ్‌దాల్‌ కోకోనట్‌ ఖీర్‌ ట్రై చేద్దాం

మూంగ్‌దాల్‌ కోకోనట్‌ ఖీర్‌ 

కావలసినవి: పెసరపప్పు – అరకప్పు; నీరు – ఒకటిన్నర కప్పు; కొబ్బరిపాలు – ముప్పావు కప్పు (కొబ్బరి పాలు వీలుకాక΄ోతే గేదెపాలు లేదా ఆవుపాలు); బెల్లం  పొడి– ముప్పావు కప్పు; యాలకుల  పొడి – అర టీ స్పూన్‌; జీడిపప్పు – పది; కిస్‌మిస్‌ – పది ; ఎండుకొబ్బరి పలుకులు – 2 టేబుల్‌ స్పూన్‌లు; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్‌లు; వెన్న తీయనిపాలు – అరలీటరు (పావు  వంతుకు ఇంకే వరకు మరిగించాలి).

తయారీ: ∙మందపాటి పెనం వేడి చేసి అందులో పెసరపప్పు వేసి మంట తగ్గించి పచ్చివాసనపోయి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. వేడి తగ్గిన తరవాత పప్పును కడిగి నీటిని ΄ోసి ప్రెషర్‌ కుకర్‌లో రెండు – మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి ∙ఈ లోపు బెల్లం పొడిని ఒక పాత్రలో వేసి నాలుగు టేబుల్‌ స్పూన్‌ల నీటిని పోసి మరిగించాలి. చిక్కబడేటప్పుడు దించి పక్కన పెట్టాలి ∙ఒక పెనంలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్‌మిన్, ఎండుకొబ్బరి పలుకులను వేయించి పక్కన పెట్టాలి ∙ప్రెషర్‌ కుకర్‌ వేడి తగ్గిన తర్వాత మూత తీసి పెసరపప్పును మెదపాలి. అందులో కొబ్బరిపాలు కలిపి స్టవ్‌ మీద పెట్టి ఒక చిన్న మంట మీద ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. ఆ తర్వాత బెల్లం పాకం, యాలకుల పొడి కలిపి ఉడికించాలి. ఇప్పుడు చిక్కటి పాలను కూడా పోసి కలిపితే పెసరపప్పు పాయసం రెడీ. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్, ఎండుకొబ్బరి పలుకులను నేతితో సహా వేసి కలపాలి. 

గమనిక: నీటి కొలత ప్రెషర్‌ కుకర్‌లో ఉడికించడానికి మాత్రమే. పాత్రను నేరుగా స్టవ్‌ మీద పెట్టి ఉడికిస్తే కనీసం మూడు కప్పుల నీరు అవసరమవుతుంది. కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము – 2 కప్పులు; యాలకుల పొడి– పావు టీ స్పూన్‌ ; జీడిపప్పు – 10; నెయ్యి– టీ స్పూన్‌; చక్కెర – ముప్పావు కప్పు (రుచిని బట్టి మోతాదు మార్చుకోవాలి); పాలు – కప్పు.

 
పచ్చికొబ్బరితో లడ్డు..

తయారీ: ∙ఒక పెనంలో నెయ్యి వేడి చేసి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టాలి ∙అదే పెనంలో కొబ్బరి తురుము,పాలు, చక్కెర, యాలకుల పొడి వేసి మరిగించాలి ∙మిశ్రమం అడుగుకు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరయ్యేటప్పుడు తరచుగా కలుపుతూ ఉండాలి పాలు, చక్కెరలను కొబ్బరి తురుము పూర్తిగా పీల్చుకుని తేమ ఇంకిన తర్వాత స్టవ్‌ ఆపేయాలి ∙మిశ్రమం వేడి తగ్గి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో జీడిపప్పు వేసి కలిపి మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత సైజులో చేతుల్లోకి తీసుకుని లడ్డూలు చేయాలి. 

గమనిక : చక్కెర బదులు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చక్కెరతో చేస్తే చూడడానికి తెల్లగా ఆకర్షణీయంగా ఉంటాయి. పిల్లలకు చక్కెర తింటే జలుబు చేసేటట్లయితే బెల్లంతో చేసుకోవచ్చు.

Videos

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

కొండా రెడ్డి బురుజు సాక్షిగా దొరికిన బడి దొంగలు

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)