Breaking News

డ్రైఫ్రూట్స్‌ ఎపుడు, ఎలా తిన్నా మంచిదే.. కానీ!

Published on Mon, 07/29/2024 - 16:13

మంచి ఆరోగ్యం కోసం ఆహారం అనగానే గుర్తొచ్చే ప్రధాన వాటిల్లో డ్రైఫ్రూట్స్  ఒకటి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభించే  డ్రైఫ్రూట్స్  వల్ల మంచి శక్తి  లభిస్తుంది.  రోజూ కాసిన్ని డ్రై ఫ్రూట్స్  తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే  డ్రైఫ్రూట్స్ తినడానికి సరైన సమయం ఏది? ఉదయమే తినాలా? భోజనానికి ముందు తీసుకోవాలా? తర్వాత తీసుకోవాలా?  రాత్రి తినడం మంచిదా? ఇలాంటి సందేహాలుంటాయి చాలామందికి.  

డ్రైఫ్రూట్స్‌ని  ఎపుడు,ఎలా తిన్నా మంచిదే.  కొంతమంది నానబెట్టుకుని కూడా తింటారు. మన ఆహారంలో డ్రైఫ్రూట్స్‌ని చేర్చుకుంటే రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, హృదయ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్స్ లో విటమిన్స్, మినరల్స్, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్,ఫైబర్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.  వాస్తవానికి ఎపుడు తీసుకున్నా మంచిదే. అయితే ఉదయం అల్పాహారంగానీ, మధ్యాహ్నం భోజనం తరువాత గానీ, సాయంత్నం చిరుతిండిగా కానీ తీసు కోవచ్చు.  అయితే  అతి సర్వత్రా వర్జయేత్‌ అని అవసరాన్ని బట్టి మితంగా తీసుకోవాలి అనేది గమనించాలి.

ఉదయాన్నే పరగడుపున డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వలన ఆ రోజంతా కూడా ఎంతో ఉల్లాసంగా  ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన శక్తి అనేది లభిస్తుంది.బాదం పప్పులను రాత్రి నానబెట్టుకుని ఉదయం లేవగానే తీసుకుంటే మంచిది. పోషకాలతో పాటు, మంచి గ్లోకూడా వస్తుంది. 

వర్కవుట్‌కు ముందు డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవల్స్‌ను పెంచి, ఫిట్‌నెస్ లక్ష్య సాధనలో తోడ్పడుతుంది. డ్రైఫ్రూట్స్‌లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. కనుక వ్యాయామం తరువాత కూడా తీసుకోవచ్చు. జీడిపప్పు వాల్‌నట్స్‌ను మితంగా తీసుకుంటే గుండె సమస్యలను  నియంత్రించవచ్చు. 

మధ్యాహ్న ఆకలిని అరికట్టడానిక , శరీరానికి బూస్ట్ అందించడానికి డ్రై ఫ్రూట్స్ సరైన పరిష్కారం. డైటరీ ఫైబర్‌ ఉంటే ఎండు ద్రాక్ష అంజిర్, ఖర్జూరం తీసుకొంటే మంచిది.  రక్తహీనత రాకుండా కాపాడుతాయి. ఎండు ద్రాక్షలో పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది.

ఈవినింగ్‌ సాక్స్‌లాగా వేయించిన జీడిపప్పు తీసుకోవచ్చు. వీటిల్లో కొలెస్ట్రాల్ అనేది అసలు ఉండదు. దీంతో గుండె పనితీరును పెంచేందుకు ఎంతో సహాయం చేస్తాయి. నిద్రవేళ స్నాక్స్‌కు అద్భుతమైన ఎంపిక డ్రైఫ్రూట్స్‌. ఎండిన ఆప్రికాట్లు లేదా చెర్రీస్‌తో పాటు బాదం లేదా వాల్‌నట్‌ లాంటి డ్రై ఫ్రూట్స్‌లో ఉండే పోషకాలు విశ్రాంతినిస్తాయి. వీటిల్లోని మెగ్నీషియం కండరాలను రిలాక్స్  చేస్తుంది. ప్రశాంతంగా నిద్ర పట్టేలా చేస్తుంది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)