Breaking News

ద్రౌపది ముర్ము మోదీకి దహీ-చీనీని తినిపించడానికి రీజన్‌!

Published on Sat, 06/08/2024 - 10:49

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను రాష్ట్రపతి భవన్‌కి ఆహ్వానించారు. ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించేందుకు సూచనగా.. దహీ చీనీని రాష్ట్రపతి ద్రౌపది ముర్మునే స్వహస్తాలతో మోదీకి అందించారు. ఇలా ఎందుకు తినిపిస్తారు? ఏంటీ స్వీట్‌ ప్రాముఖ్యత.

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ విజయ దుందుభి మోగించారు. ఆ తర్వాత నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్డీఏ) భాగస్వామ్య పక్షాలన్నీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీని రాష్టపతి భవన్‌కి ఆహ్వానించారు. ముచ్చటగా మూడోసారి పదవిని అంకరిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలుతూ.. మోదీకి దహీ-చీనీని తినిపించారు రాష్టపతి ముర్ము. ఈ ఆచారం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇలా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ స్వీట్‌ తీసుకోవడం అనాదిగా జరుగుతుంది. ఇలా ఎందుకు చేస్తారంటే..

 

దహీ-చీనీ అంటే..
పెరుగు-పంచదార లేదా బెల్లంతో కూడిన స్వీట్‌. దీన్ని దహీ-చీనీ అంటారు. ఈ స్వీట్‌ సంప్రదాయం భారతీయ సంస్కృతిలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు వెళ్లే పెద్దలు, పిల్లలకు ఇలా పెరుగుతో కూడిన బెల్లం లేదా చక్కెరను తినిపిస్తారు. ఇలా చేస్తే వారికి మంచి అదృష్టం, విజయం లభిస్తుందని పెద్దల నమ్మకం. ఇలా దహీ చీనీని తినడం వెనుకు పెద్ద శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో దహీని కపా-వర్థక్‌ అని అంటారు. అంటే శరీరానికి స్వాంతన చేకూర్చి, ప్రశాంతతను ఇచ్చేది అని అర్థం. వేసవిలో దీన్ని తీసుకోవడంలో శరీరానికి చలువ చేస్తుంది. 

ఇందులో కలిపే పంచదార లేదా బెల్లం శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది. ఈ రెండింటి కలియిక ఒత్తిడిని తగ్గించి, అలసటను దూరం చేస్తుంది. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. దీనిలో కాల్షియం, రిబోఫ్లేవిన్‌, బీ6, బీ12 ఉంటాయి. ముఖ్యంగా పెరుగులో ఉండే బ్యాక్టీరియా శరీరానికి మంచి ప్రోబయోటిక్స్‌ని అందించి ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని తీపి శరీరానికి తక్షణ ఎనర్జీని ఇచ్చే ఇంధనంగా ఉంటుంది కాబట్టి ఈ స్వీట్‌ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. భారతీయ సంప్రదాయంలో ఉండే కొన్ని ఆచారాలు సైన్సుతో ముడిపడి ఉంటాయి. అవి మానవుల హితార్థం ఏర్పరిచినవే. 

కాగా, ఇక్కడ మోదీ ప్రధానిగా మంచి పాలను ప్రజలకు అందించే క్రమంలో ఎదురయ్యే సమస్యలను సునాయాసంగా జయించి కీర్తి గడించాలని కోరుకుంటూ ఈ దహీ చీని రాష్ట్రపతి తినిపించడం జరుగుతుంది. అంటే నీకు మంచి జరగాలని ఆశ్వీరదిస్తూ ఓ మధురమైన స్వీట్‌తో పని ప్రారంభిస్తే..ఆ మధురమైన తీపి పదార్థం వలే పనులన్నీ ఆనందాయకంగా చకచక అవుతాయని అర్థం. అలాగే మనం కూడా మంచి జరిగినా, ఏదైనా విజయం సాధించిన స్వీట్లతోనేగా వేడుక చేసుకుంటాం. అయితే ఇక్కడ మన సంప్రదాయం ఆరోగ్య ప్రయోజనాలతో కూడి ఈ స్వీట్‌తో ప్రారంభించమని చెబుతుతోంది.

(చదవండి: మృగశిర కార్తెకు ఆ పేరే ఎలా వచ్చింది? బెల్లం ఇంగువ ఎందుకు తింటారు?)

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)