Breaking News

మూడేళ్ల చిన్నారిని రక్షించడంలో డ్రోన్‌ సాయం..!

Published on Mon, 09/09/2024 - 10:29

మూడేళ్ల చిన్నారి డ్రోన్‌ సాంకేతికతో విజయవంతంగా రక్షించారు అధికారులు. ఇలాంటి రెస్క్యూఆపరేషన్‌లో డ్రోన్‌ సాంకేతికత సమర్థవంతంగా ఉపయోగపడుతుందనే విషయం ఈ సంఘటనతో తేటతెల్లమయ్యింది.

అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని విస్కాన్సిన్‌లో ఆల్టోలో అనే ప్రాంతంలో మూడేళ్ల చిన్నారి దట్టమైన మొక్కజొన్న పొలంలో తప్పిపోయాడు. అదికూడా రాత్రి సమయం కావడంతో అతడి ఆచూకి కష్టతరంగా మారింది. సమాచారం పోలీసులకు అందడంతో రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా ప్రారంభించారు. అది రాత్రి సమయం కావడం, దీనికితోడు దట్టమైన మొక్కజొన్న అడవి తదితర కారణాల వల్ల చిన్నారి జాడ కనిపెట్టడం సాధ్యం కాలేదు. దీంతో ఫాండ్‌ డు లాక్‌ కౌంటీ షెరీఫ్‌ పోలీసులు మొక్కజొన్న క్షేత్రాన్ని స్కాన్‌ చేసేందుకు థర్మల్‌ డ్రోన్‌ని మోహారించారు.

దీనిలోని ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరా హీట్‌ సిగ్నేచర్లు చిన్నారి ఉన్న ప్రదేశాన్ని గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. ఆరడగుల పొడవైన కాండాలతో నిండిన మొక్కజొన్న పొలాన్ని డ్రోన్‌ సర్వే చేయడంతో వీడియో తీయడం ప్రారంభించిన నలుపు తెలుపు ఆకృతి నమునాలను ఇచ్చింది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఒక ఆకారం మొక్కజొన్న గుండా కదలడం ప్రారంభించింది. స్క్రీన్‌పై ఏకరీతి నమునాకు అంతరాయం కనిపించడంతో..ఇది తప్పిపోయిన చిన్నారి కదలికలని నిర్థారణ చేశారు.  వెంటనే ఆ ప్రదేశానికి చేరుకునేలా అధికారులను అప్రమత్తం చేశారు. 

ఆ తర్వాత బాలుడిని సురక్షితంగా ఆ మొక్కజొన్న పొలం నుంచి రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ ఘటన సాంకేతికత ప్రాముఖ్యతను హైలెట్‌ చేసింది. అలాగే దట్టమైన మొక్కజొన్న పొలం, రాత్రి సమయం వల్ల చిన్నారి ఆచూకి కనిపెట్టడం అంత సులభం కాలేదు. ఒకవేళ సాంకేతిక సాయం లేనట్లయితే గంటలకొద్ది సమయం పట్టొచ్చు లేదా చిన్నారికి అనుకోని ఆపద ఏదైనా ఎదురయ్యే ప్రమాదం కూడా లేకపోలేదని అన్నారు షెరీఫ్ కార్యాలయం అధికారులు.

(చదవండి: సైన్సుకే సవాలుగా శాంతి దేవి పునర్జన్మ రహస్యం: విస్తుపోయిన శాస్త్రవేత్తలు..!)

 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)