కొడుకు కెరీర్‌ కోసం..ఆ తండ్రి ఏం చేశాడో తెలిస్తే విస్తుపోతారు..!

Published on Thu, 10/30/2025 - 16:15

పిల్లల కోసం కన్నవాళ్లు ఎంతైన కష్టపడతారు. ఏం చేయడానికైనా వెనుకాడరు. అలానే ఈ తండ్రి తను కుమారుడు కెరీర్‌ కోసం చేస్తున్న పని అందర్నీ ఆలోచింప చేసేలా ఉండటమే గాదు, అందరి హృదయాలను తాకింది. మార్కెటింగ్‌ నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రయత్నించే ఎంబీఏ స్టూడెంట్స్‌కి ఇవి గొప్ప పాఠాలు.

ఒక క్యాబ్‌డ్రైవర్‌ తన వాహనాన్ని మొబైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఛానల్‌గా మార్చాడు. వాట్‌ అనుకోకండి అసలు కథలోకి వెళ్దాం. రోజువారిగా ప్రయాణీకులను డ్రాప్‌ చేసి వారితో సంభాషిస్తు..తన కుమారుడి కెరీర్‌కు తన వంతు ప్రోత్సాహం అందిస్తున్నాడు. 

అదికూడా సాంకేతిక సాయంతో. దీన్ని గమనించిన మార్కెటింగ్‌ ప్రొఫెషనల్‌ దివ్యుషి సోషల్‌ మీడియా పోస్ట్‌ నెట్టింట షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఆమె క్యాబ్‌ డ్రైవర్‌ సీటుకి అటాచ్‌ చేసిన క్యూర్‌ కోడ్‌ని చూసి డిజిటల్‌ చెల్లింపు అనుకుందామె. అదే విషయం డ్రైవర్‌ని అడగగా..ఇది చెల్లింపులకు సంబంధించినది కాదని, తన కొడుకు స్వయంగా తయారు చేసుకున్న రాప్‌ సంగీతాన్ని ప్రదర్శించే యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రత్యక్ష లింక్‌ని సమాధానమిస్తాడు. 

ఎలాంటి అధికారిక విద్య నేపథ్యం లేకపోయినా..ఇతడి ఆలోచన తీరుకి దివ్యుషి ఇంప్రెస్‌ అయ్యింది. ప్రతి ప్రయాణికుడిని ఎక్కించుకుంటూ..దీని గురించి వాళ్లకి చెబుతూ..కుమారుడి డిజిటల్‌ కంటెంట్‌ని పైసా ఖర్చు లేకుండా ప్రమోట్‌  చేస్తున్నాడాయన అని రాసుకొచ్చింది పోస్ట్‌లో దివ్యుషి. 

పరిమితమైన వనరులతో తను చేయగలిగింది చేస్తున్న ఈ తండ్రి సాయం నెటిజన్లు హృదయాలను గెలుచుకుంది. అంతేగాదు స్థానిక ట్యాక్సీలు డిజిటల్‌ విజయానికి లాంచ్‌ప్యాడ్‌లా ఉంటాయని ఇప్పుడే తెలిసిందని మరికొందరు కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.  

(చదవండి: మన వంటకం దోసె..బ్రిటిష్‌ చెఫ్‌ని ఎంతలా మార్చేసింది..!)

 

#

Tags : 1

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)