Breaking News

తిన్న వెంటనే టీ తాగుతున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసమే!

Published on Sat, 08/16/2025 - 11:27

చాలా మందికి  పొద్దున్నే లేవగానే వేడి వేడి టీ కడుపులో పడనిదే బండి నడవనని మొరాయిస్తుంది. అంతెందుకు, సంతోషంలోనూ, దుఃఖంలోనూ, ఉల్లాసంలోనూ, ఉత్సాహంలోనూ, ఆందోళనలోనూ, ఆనందలోనూ కూడా గరమ్‌ గరమ్‌ చాయ్‌ పడనిదే పొద్దు΄ోదు. ఆవేశం వచ్చినా, ఆగ్రహం వచ్చినా దానిని చల్లార్చేది టీనే. కొందరయితే భోజనం చేయగానే టీ తాగుతారు. అయితే అది అంత మంచి అలవాటు కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆహారం తిన్న వెంటనే టీ తాగడం వల్ల తిన్న ఆహారంలోని పోషకాలు వంటికి పట్టవట. అంతేకాదు, టీలో ఉండే టానిన్లు, పాలీఫేనోల్స్‌ రక్తంలో ఐరన్‌ కలవకుండా అడ్డుకుంటాయట. అంతేకాదు, జీర్ణరసాలు ఊరకుండా కూడా చేస్తాయట. అందుకే అన్నం తిన్న వెంటనే కాకుండా కనీసం గంటా గంటన్నర వరకు ఆగి అప్పుడు టీ తాగడం కొంతమేరకు నయం అని ΄ోషకాహార నిపుణులు చెబుతున్నారు.  

ఆరోగ్యానికి విటమిన్‌ సి
ఆరోగ్యానికి విటమిన్‌ సి చాలా అవసరం. విటమిన్‌ సి ఎక్కువగా ఉన్న నిమ్మ, కమలాఫలం, కివీ, పాలకూర, ఉసిరి, బ్రొకోలీ, టమాట, అడవి ఉసిరి, కాలీఫ్లవర్‌ తినడం వల్ల ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పెరుగుతుందని తేలింది. ఫ్రీ రాడికల్స్‌ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి కౌంట్‌ని పెంచడంలో ఈ ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ తగ్గిన వారు సమస్యని పరిష్కరించుకునేందుకు వీటిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఒకవేళ తినడం కష్టం అనుకుంటే వీటితో సలాడ్‌ చేసి భోజనానికి ముందుగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక కమలా ఫలాల్ని జ్యూస్‌లా చేసుకోని తాగేయొచ్చు.

#

Tags : 1

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)