Breaking News

చిన్న వయసులో చూపు కోల్పోయినా.. ప్రతిభతో జ్వలిస్తోంది..!

Published on Tue, 05/20/2025 - 10:31

చిన్న వయసులోనే యాసిడ్‌ దాడికి గురైన కఫీకి భవిష్యత్‌ మసక మసకగా కూడా కనిపించలేదు. అంతా అంధకారమే! భయానకమైన నిస్సహాయతలో నుంచి కూడా అప్పుడప్పుడూ  అభయమిచ్చే శక్తి ఏదో పుట్టుకువచ్చి....

‘అదిగో నీ భవిష్యత్‌’ అని చూపుతుంది. కఫీ విషయంలోనూ అలాగే జరిగింది. ఛండీఘడ్‌కు చెందిన కఫీ 2023లో క్లాస్‌ 10 సీబీఎస్‌ఈ పరీక్షల్లో 95.2 శాతం మార్కులు సాధించి వార్తల్లో నిలిచింది. తాజాగా... క్లాస్‌ 12 సిబీఎస్‌ఈ బోర్డు పరీక్షల్లో 95.6 శాతం మార్కులు సాధించి తిరిగి వార్తల్లోకి వచ్చింది. తన విజయాన్ని కుటుంబ సభ్యులకు అంకితం చేసిన కఫీ... ‘తల్లిదండ్రులు నా బలం. 

స్ఫూర్తి. వారు నా కోసం ఎంతో త్యాగం చేశారు. వారి రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలు మన భవిష్యత్తును నిర్ణయించలేవు. మన కష్టమే మన భవిష్యత్తు’ అంటుంది కఫీ.

కఫీ మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, హోలి పండగ రోజు ముగ్గురు వ్యక్తులు రంగు చల్లినట్లు తనపై యాసిడ్‌ చల్లారు. వారి రాక్షసానందానికి ఆ చిన్నారి కంటి చూపు దెబ్బతిన్నది. కఫీకి తిరిగి చూపు తెప్పించడానికి తల్లిదండ్రులు ఇరవై లక్షలకు పైగా ఖర్చు చేశారు.‘నా లక్ష్యం ఐఏఎస్‌’ అని ఆత్మవిశ్వాసం నిండిన స్వరంతో చెబుతోంది కఫీ. 

(చదవండి: 'చూపే బంగారం'..! అంధత్వ సమస్యలకు చెక్‌పెడదాం ఇలా..)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)