Breaking News

పెళ్లిచేస్తే మా అబ్బాయి బాగు పడతాడా?

Published on Thu, 04/23/2026 - 11:09

మా అబ్బాయి వయసు ఇరవై నాలుగు. మాది మేనరికం కావడం వల్ల అనుకుంటాను, చిన్నప్పటి నుంచి అతనికి నడక, మాటలు కొంచెం ఆలస్యంగా వచ్చాయి. ఐదేళ్ల వయసులో స్కూల్‌కు పంపించాము. ఐదవ తరగతి వరకు బాగానే చదివాడు. కానీ ఆరవ తరగతి నుంచి విషయాలు గుర్తుంచుకోలేకపోవడం, సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అవడం జరుగుతుండేది. టీచర్లు మమ్మల్ని పిలిచి, అబ్బాయికి చదువు కష్టంగా ఉందని చెప్పేవారు. అయితే, మేము అతన్ని ఎలాగోలా పదోతరగతి పాస్‌ చేయించాము. తర్వాత ఓపెన్‌ స్కూలింగ్‌ ద్వారా ఇంటర్, డిగ్రీ కూడా పూర్తి చేయించాము. అబ్బాయి చూడడానికి బాగుంటాడు. బైక్‌ కూడా బాగా నడుపుతాడు. 

మేము బయటకి పంపించి ఏదైనా తీసుకు రమ్మంటే తీసుకు వస్తాడు. కానీ తనంతట తానే నిర్ణయాలు తీసుకోలేడు. అతను సినిమా లేదా టీవీలో హీరోయిన్‌ ను చూసినప్పుడు, లేదా బయట ఆడవాళ్లను చూసినప్పుడు కొంచెం ఎగ్జైట్‌ అవుతున్నాడు. మాకు ఆ విషయం అర్థమవుతోంది. ఇప్పుడు మేము అతనికి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. పెళ్లి వల్ల అతని తెలివితేటలు పెరుగుతాయని మా చుట్టాలందరూ అంటున్నారు. పెళ్లి చేస్తే నిజంగా మా అబ్బాయి బాగుపడతాడా? దయచేసి మాకు సరైన సలహా ఇవ్వగలరు.
– రామకృష్ణారావు, రాయచూరు

మీ అబ్బాయి విషయంలో మీరు పడుతున్న తాపత్రయం అర్థమవుతోంది. మేనరికం వల్ల కలిగే జన్యుపరమైన ప్రభావాల వల్ల కొందరిలో శారీరక ఎదుగుదల బాగున్నా, మెదడు పరిణతి ఆశించిన స్థాయిలో ఉండదు. దీనినే  ‘మేధోపరమైన వైకల్యం’ అంటాము. మీరు గమనించినట్లు చదువులో వెనుకబడటం, సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం కేవలం నిర్లక్ష్యం వల్ల వచ్చేవి కావు, అవి అతని మెదడు గ్రహణశక్తి పరిమితులను సూచిస్తాయి. మన సమాజంలో ‘పెళ్లి చేస్తే బాధ్యత వస్తుంది, తెలివి తేటలుపెరుగుతాయి’ అనే ఒక బలమైన అపోహ ఉంది. కానీ శాస్త్రీయంగా పెళ్లి వల్ల మేధోశక్తి పెరగదు, పైగా కొత్తగా వచ్చే సామాజిక వైవాహిక బాధ్యతలు అతనిపై మానసిక ఒత్తిడిని పెంచుతాయి.

 వైవాహిక జీవితంలో కేవలం శారీరక ఆకర్షణే కాకుండా, ఎదుటి వ్యక్తి భావాలను అర్థంచేసుకోవడం, ఆర్థికంగా కుటుంబాన్ని నడపడం, సమస్యలను పరిష్కరించుకోవడం వంటి ‘అడాప్టివ్‌ ఫంక్షనింగ్‌’ నైపుణ్యాలు చాలా కీలకం. కేవలం చూసేందుకు బాగున్నాడు కదా అని లేదా  కోరికలు ఉన్నాయి కదా అని పెళ్లిచేయడం సరైన పరిష్కారం కాదు. ఇది ఇటు మీ అబ్బాయికి, ఇటు పెళ్లి చేసుకుని వచ్చే అమ్మాయికి కూడా ఇబ్బందికరంగా మారవచ్చు. పెళ్లి చేస్తే తిక్క కుదురుతుందనేది పాత నానుడి. కానీ సరైన మానసిక పరిణితి లేని పెళ్లి కొత్త చిక్కులకు నాంది అనేది నేటి పరిస్థితి. 

మొదట స్థానికంగా ఉన్న మనోవైద్యుని సంప్రదించి అతనికి ఐక్యూ సోషల్‌ మెచ్యూరిటీ పరీక్షలు చేయించండి. అతని మానసిక వయసు ఎంతో తెలుసుకోవడం వల్ల, అతను ఒక సంసారాన్ని మోయగలడా లేదా అనేది స్పష్టమవుతుంది. ఆ నివేదికల ఆధారంగా నిపుణుల సలహాతో ముందడుగు వేయడం మీ అందరికీ శ్రేయస్కరం. అలాగే, పెళ్లి సంబంధం చూసేటప్పుడు అవతలి వారికి అన్నీ నిజాలు చె΄్పాలి. నిజం దాచి పెళ్లిచేస్తే, భవిష్యత్తులో రకరకాలైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తొందరపడకండి. అన్ని వైపుల నుంచి ఆలోచించి సరియైన నిర్ణయం తీసుకోండి. 


డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, 
సీనియర్‌ సైకియాట్రిస్ట్,
విజయవాడ. 
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ:  sakshifamily3@gmail.com

Videos

90 శాతం ఓటింగ్.. ఫుల్ జోష్ బెంగాల్ బీజేపీ

సెన్స్ లేదా..? జనసేన నేతలపై నాగబాబు సీరియస్

భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..?

జపాన్ లో మరి కొద్ది రోజుల్లో.. మెగా సునామీ...

నా కొడుకు తప్పేం మాట్లాడలేదు.. TDP పై MLA కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు

ఓటు వేసిన సూర్య, జ్యోతిక

ప్రభుత్వం స్పందించడంలేదని డ్రైవర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

బాబుగారి మరో క్రెడిట్ చోరీ.. కొంచమైనా సిగ్గుగా లేదా.. నీ ఖాతాలో వేసుకోవడానికి..

చంద్రబాబు నన్ను ఇంటికి పిలిచి బెదిరించారు

ఏపీలో మండిపోతున్న ఎండలు

Photos

+5

ప్రముఖ ఎగ్జిబిషన్‌లో టాలీవుడ్ యాంకర్‌ లాస్య సందడి (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో బుల్లితెర బ్యూటీ మంజుల సమ్మర్ చిల్ (ఫోటోలు)

+5

హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల ఇంట డబుల్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో జయం రవి, సింగర్ కెనీషా (ఫోటోలు)

+5

సంజనా గల్రానీ కూతురు బర్త్‌డేలో పాపులర్‌ ఎమ్మెల్యే (ఫోటోలు)

+5

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. పొద్దుపొద్దున్నే ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

జర్నీ జామ్‌ ఫుల్‌.. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల నిలువు దోపిడీ, ఇక్కట్లు (ఫొటోలు)

+5

‘జెట్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

రెడ్‌ రోజ్‌లా మెరిసిపోతున్న హీరోయిన్ మానస వారణాసి (ఫొటోలు)

+5

రానా సతీమణి మిహికా బజాజ్ ఆర్ట్‌ షో.. సందడి చేసిన టాలీవుడ్ తారలు (ఫొటోలు)