Breaking News

ఆరు పదులకు అందాల కిరీటం

Published on Fri, 11/22/2024 - 13:29

వయసు శరీరానికి మాత్రమే.. మనసుకు కాదని ప్రతి మహిళకూ తెలియజేయాలనే లక్ష్యంతో తాను అందాల పోటీలో పాల్గొన్నానని, అందులో విజయం సాధించానని హైదరాబాద్‌ నగరానికి చెందిన విద్యావేత్త డాక్టర్‌ విజయ శారదరెడ్డి తెలిపారు. బ్యాంకాక్‌లో జరిగిన మిస్సెస్‌ ఆసియా ఇంటర్నేషనల్‌ పోటీల్లో క్లాసిక్‌ మిసెస్‌ ఇంటర్నేషనల్‌ 2024 కిరీటాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. 

ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆరు పదుల వయసు దాటినా, తాను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నానని, అపరిమిత శక్తి సామర్థ్యాలు ఉండి కూడా బలహీనులమని భావిస్తూ ఇంటికే పరిమితమవుతున్న మహిళలను ప్రోత్సహించేందుకు, స్ఫూర్తి నింపేందుకు తాను ప్రయత్నిస్తున్నానని తెలిపారు. 

బ్యాంకాక్‌లో జరిగిన పోటీల్లో రత్న మెహెరా మిసెస్‌ ఆసియా రన్నరప్, మిసెస్‌ ఎలిగాన్స్, మిసెస్‌ పాపులారిటీ విభాగంలో పథకాలను సాధించారు. మణికొండలో మీట్‌–గ్రీట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర, దేశ స్థాయిలో విజయం సాదించిన తాను ఈ సంవత్సరం ఆసియా స్థాయిలో పోటీ పడి ఒకే వేదికపై మూడు పథకాలు సాదించటం ఆనందంగా ఉందన్నారు. ఆసియా స్థాయిలో 18 మందితో పోటీ పడి విజేతగా నిలిచానన్నారు. పేద పిల్లల విద్య, వికాసానికి సేవా చేస్తున్నానని, చేనేత కార్మికులకు తోడుగా నిలుస్తున్నానని అన్నారు.  
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)