Breaking News

చాలా ఏళ్లుగా.. ఈ క్యాన్సర్ తో బాధ పడుతున్నాను.. ఏదైనా??

Published on Sun, 07/21/2024 - 04:40

నాకు 40 ఏళ్లు. చాలా ఏళ్లుగా బ్రెస్ట్‌ పెయిన్‌తో సఫర్‌ అవుతున్నాను. నెలసరి ముందు వచ్చే పెయిన్‌ నార్మలే అన్నారు. కానీ నాకు నెలంతా ఉంటోంది. ఇదేమైనా క్యాన్సర్‌కి దారితీస్తోందేమోనని భయంగా ఉంది. – పేరు, ఊరి పేరు రాయలేదు.

పీరియడ్స్‌కి ముందు వచ్చే బ్రెస్ట్‌ పెయిన్‌ సాధారణంగా హార్మోనల్‌ చేంజెస్‌ వల్ల వస్తుంది. అదేం సమస్య కాదు. ఇలాంటి నొప్పికి బ్రెస్ట్‌కి మంచి సపోర్ట్‌ ఇచ్చే ఇన్నర్‌వేర్‌ వేసుకోవడం, పెయిన్‌ కిల్లర్స్‌ లేదా విటమిన్‌ ఇ మాత్రలు లాంటివి వాడితే తగ్గిపోతుంది. కానీ పెయిన్‌ నెలంతా ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి. బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్స్‌ చేయించుకోవాలి.

బ్రెస్ట్‌ టిష్యూలో జరిగే కొన్ని మార్పులతో ఫైబ్రస్‌ టిష్యూ పెరిగి పెయిన్‌ రావచ్చు. బ్రెస్ట్‌ కింద ఉన్న చెస్ట్‌ వాల్‌ నుంచి మజిల్‌ లేదా రిబ్‌ ప్రాబ్లంతో బ్రెస్ట్‌లోకి పెయిన్‌ రేడియేట్‌ కావచ్చు. అలాంటి పెయిన్‌ని కాస్టోకాన్‌డ్రైటిస్‌ (ఛిౌట్టౌఛిజిౌnఛీటజ్టీజీట) అంటారు. ఊపిరి తీసుకునేటప్పుడు పెయిన్‌ పెరుగుతుంది. బ్రెస్ట్‌లో ఇన్‌ఫ్లమేషన్‌ వచ్చినా పెయిన్‌ ఉంటుంది. అయితే ఇది అరుదుగా ఉంటుంది. బ్యాక్టీరియల్‌ లేదా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ బ్రెస్ట్‌లోని టిష్యూ ఇన్‌ఫెక్షన్‌కి కారణం అవుతుంది.

దీనికి  హయ్యర్‌ యాంటీబయాటిక్స్‌తో వెంటనే చికిత్సను అందించాలి. కొంతమందికి హెర్పిస్‌ లేదా షింగల్స్‌తో బ్రెస్ట్‌ మీద దద్దుర్లు, నొప్పి ఉంటాయి. దీన్ని యాంటీవైరల్‌ మెడిసిన్‌తో ట్రీట్‌ చేయాలి. చాలా అరుదుగా బ్రెస్ట్‌ లంప్స్, బ్రెస్ట్‌ ట్యూమర్‌ ఉంటే పెయిన్‌ రావచ్చు. బ్రెస్ట్‌ సిస్ట్స్‌ అంటే బ్రెస్ట్‌లో ఫ్లూయిడ్‌తో నిండిన సిస్ట్స్‌ ఏర్పడతాయి. వాటివల్ల కూడా నడిచినప్పుడు, ప్రెషర్‌కి పెయిన్‌ వస్తుంది. చాలామంది.. పెయిన్‌ రావడంతోనే బ్రెస్ట్‌ క్యాన్సరేమో అని భయపడతారు. కానీ బ్రెస్ట్‌ క్యాన్సర్‌లో మొదటి సింప్టమ్‌.. బ్రెస్ట్‌లో అసాధారణ రీతిలో లంప్‌ ఉండటం. చాలాసార్లు పెయిన్‌ ఉండదు.

అయితే బ్రెస్ట్‌ నుంచి డిశ్చార్జ్‌ ఉన్నా, లంప్స్‌ ఉన్నా, స్వెల్లింగ్, రెడ్‌నెస్‌ ఉన్నా, చంకల్లో లంప్స్‌ ఉన్నా ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించాలి. రొటీన్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్, బ్రెస్ట్‌ అల్ట్రాసౌండ్‌ స్కాన్‌తో పెయిన్‌కి, లంప్‌కి కారణాలను డిటెక్ట్‌ చేయొచ్చు. ఎర్లీగా ఏది  డిటెక్ట్‌ అయినా వెంటనే చికిత్స మొదలుపెడితే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. ప్రతినెల పీరియడ్స్‌ అయిపోయిన వెంటనే సెల్ఫ్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌ చేసుకోవడం మంచిది.

– డా. భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)