Breaking News

సారీ... విసిగి వేసారి...

Published on Sat, 04/11/2026 - 05:51

ఆ రాత్రి...
వైట్‌హౌజ్‌లోకి వచ్చిన రిపబ్లికన్‌ పార్టీ అతి ముఖ్య కీలక మోస్ట్‌ ఇంపార్టెంట్‌ నాయకులు రోనాల్డ్‌ ఢామ్‌ డీమ్, కేనాల్డ్‌ బోనల్డ్, రెనాల్డ్‌లు గాఢ నిద్రలో ఉన్న ట్రంప్‌ను నిద్ర లేపారు.
‘నాన్సెన్స్‌... ఇప్పుడొచ్చారేమిటి!!!!’ అని గట్టిగా అరిచాడు ట్రంప్‌.

‘వార్‌లో తలమునకలై క్షణం తీరిక లేకుండా అలిసిసొలిసి పోయి ఉన్నారు కదా... మీరు కాస్త రిలాక్స్‌ కావడానికి, అలా షికార్‌కు తీసుకువెళదాం. అంతకు మించి ఏంలేదు’ అని చెప్పారు త్రీ లీడర్స్‌.
‘షికార్‌ కంటే నాకు వార్‌ అంటేనే ఇష్టం’ అంటూ లేని మీసం మెలేశాడు ట్రంప్‌.

‘అలా అంటే ఎలా? మీ ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. మీరు హుషారుగా ఉంటేనే కదా వార్‌ పదికాలాల పాటు జరుగుతుంది. వార్‌ వీలైనంత ఎక్కువ కాలం పాటు జరగాలంటే మీరు రిలాక్స్‌ కావాల్సిందే... మాతో రావాల్సిందే...’ మూకుమ్మడి రిక్వెస్ట్‌ చేశారు ముగ్గురు.
  
ట్రంప్‌ తన పార్టీ లీడర్స్‌తో కలిసి పార్టీ చేసుకోవడానికి హెలికాప్టర్‌లో ఒక నిర్జన ప్రదేశానికి వచ్చాడు. మధ్యాహ్నం అయింది.
ట్రంప్‌కు విపరీతంగా ఆకలి అవుతోంది, ‘కనీసం కాఫీ కూడా లేదు’ అని కడుపు తడుముకున్నాడు.

‘ఏమైనా కావాలా?’ అని అడిగారు ఆ ముగ్గురు.
‘ధమ్‌ బిర్యానీ విత్‌ ఇరానీ చాయ్, పది కిలోల పుల్లారెడ్డి, మల్లారెడ్డి స్వీట్లు...’ ఇలా చెప్పుకుంటూ పోయాడు ట్రంప్‌.
‘పాలు, చక్కెర ఉన్నాయి. ఇరానీ చాయ్‌ తయారుచేసుకోవచ్చు. కిలోల కొద్ది చికెన్, మసాల దినుసుల ఉన్నాయి. వేడి వేడిగా ధమ్‌ బిర్యానీ చేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర ఏమున్నాయంటే...’ అని చెప్పుకుంటూ పోతున్నారు త్రీ లీడర్స్‌.

‘మనం తయారుచేసుకోవడమేమిటి!!!’ అని ఫైర్‌ మీద గుగ్గిలం అయ్యాడు ట్రంప్‌.
‘ఎప్పుడూ రెస్టారెంట్‌ నుంచి రెడీమెడ్‌ ఫుడ్‌ తెచ్చుకొని తినడం ఏం బాగుంటుంది. అలా తినీ తినీ మొహం మొత్తింది. అందుకే కాస్త చేంజ్‌గా మనమే వంట చేసుకుందాం...’ అన్నారు త్రీ లీడర్స్‌.

‘మీకు వంట వచ్చా?’ అని అడిగాడు ట్రంప్‌.
‘రాదు’ అన్నారు ముగ్గురు.
‘మరి ఏ ధైర్యంతో నన్ను ఇక్కడికి తీసుకువచ్చారయ్యా?’ ఒంటికాలి మీద లేచి బ్యాలెన్స్‌ తప్పి కింద పడ్డాడు 
ట్రంప్‌.
తనకు తానే పైకి లేచి ‘ఇక తప్పుతుందా’ అని అని వంట చేయడాని రెడీ అయ్యాడు ట్రంప్‌.
వంట కోసం పదార్థాలన్నీ రెడీ చేసుకున్నాడు.

‘అరే... ఇంతకీ గ్యాస్‌ స్టవ్‌ ఎక్కడ?... అర్జంటుగా తేవండి’ అని అరిచాడు ట్రంప్‌.
‘మీ వార్‌ పుణ్యమా అని గ్యాస్‌ లేదు స్టవ్‌ లేదు... కన్నీళ్లు, కట్టెల మంటలే ఉన్నాయి’ అన్నారు ఆ ముగ్గురు.
‘మీ ముఖం మండిపోను... గ్యాస్‌ స్టవ్‌ లేకుండా ఏ ధైర్యంతో నన్ను తీసుకువచ్చారయ్యా’ నలుదిక్కులూ అదిరిపోయేలా గర్జించాడు ట్రంప్‌.
‘మనం వెదకాలే కాని ఇక్కడ బోలెడు కట్టెలు దొరుకుతాయి. వాటితో బేషుగ్గా వంట చేసుకోవచ్చు’ అన్నారు త్రీ లీడర్స్‌.
ఆ నలుగురు ఆ ఎడారిలాంటి ప్రాంతంలో గంటల కొద్దీ వెదికినా ఒక్క కట్టెపుల్ల కూడా కనిపించలేదు పాపం!
ఏడ్పించడం తప్ప ఎప్పుడూ ఏడ్వని ట్రంప్‌ ఆకలి బాధ తట్టుకోలేక ఫస్ట్‌ టైమ్‌ భోరుమని బిగ్గరగా ఏడ్చాడు!

– యాకుబ్‌ పాషా
 

Videos

అమెరికా నష్టపరిహారం చెల్లించాల్సిందే.. మీ ఇష్టం మళ్లీ యుద్ధమే!

బయటపడ్డ ఏపీపై చంద్రబాబు కపట ప్రేమ

చంద్రబాబు తెలంగాణకు షాడో సీఎం, జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

చర్చలు విఫలమైతే మళ్లీ యుద్ధం మొదలవుతుందా?

కావాలనే నాపై తప్పుడు ప్రచారం... లాయర్‌పై సింగర్ మంగ్లీ ఫిర్యాదు

కారుపై పడ్డ కాంక్రీట్ లారీ

విమానంలో రక్తంతో తడిసిన బ్యాగులు, బూట్లు.. ఇరాన్ ఎమోషనల్ పోస్ట్!

మొయినాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

మద్యం తాగి పోలీసులపై రెచ్చిపోయిన మంత్రి సత్యకుమార్ యాదవ్ అనుచరులు

కేసీఆర్ తో దోస్తీ...రేవంత్ తో కటీఫ్.. పొలిటికల్ ఫ్యూచర్‌పై క్లారిటీ..

Photos

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)

+5

శర్వానంద్‌ 'బైకర్‌' థాంక్యూ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్‌ మానస వారణాసి (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : గచ్చిబౌలి స్టేడియంలో యోగ భాగ్యం (ఫొటోలు)

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)