Breaking News

మహిళలు ఉద్యోగం చేస్తున్నా తప్పని తిప్పలు, తీరని వ్యధ

Published on Tue, 04/22/2025 - 13:10

మాచారెడ్డి:  అందమైన దాంపత్య జీవితంలో వరకట్నం చిచ్చుపెడుతోంది. అన్యోన్యంగా సాగాల్సిన కాపురం అనుమానాలతో కలహాల కాపురంగా మారుతోంది. పెద్దల సమక్షంలో పంచాయతీలు, పోలీసులు కౌన్సెలింగ్‌ చేసినా దంపతులు మధ్య సఖ్యత కుదరడం లేదు. ఉమ్మడి మాచారెడ్డి మండలంలో వరకట్న వేధింపులు రోజు రోజుకు అధికమవుతున్నాయి. ఏడాది కాలంలో పది వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. పలువురికి పోలీసులు కౌన్సెలింగ్‌ చేసి పంపించినా మళ్లీ కొద్ది రోజులకు అత్తింటి వాళ్లు వేధింపులకు గురి చేయడంతో కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా వర కట్న వేధింపులు తప్పడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్నా పలువురు అనుమానాలతో వేధింపులకు గురి చేస్తుండగా, మరి కొందరు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి.

ఉమ్మడి మాచారెడ్డి మండలంలో జరిగిన ఘటనలు ..

● పాల్వంచ మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని కామారెడ్డి పట్టణానికి చెందిన యువకుడికి 2006వ సంవత్సరంలో ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. లాంఛనంగా 10తులాల బంగారం ఒప్పుకొని పెళ్లి సమయంలో 5తులాల బంగారం ఇచ్చి మరో 5తులాలు పదేళ్ల తర్వాత ఇస్తామని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న విధంగా ఇంకో తులం బంగారం కలిపి మొత్తం 11తులాల బంగారం ముట్టజెప్పారు.గత కొన్నేళ్లుగా భర్త,అత్త అదనపు కట్నం కోసం వేధించసాగారు. అంతటితో ఆగకుండా మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త మరో వివాహం చేసుకున్నట్టు బాధితురాలు ఇటీవల ఠాణా మెట్లెక్కింది.

● మండలంలోని సోమారంపేటకు చెందిన యువతిని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌ కు చెందిన యువకుడికి ఇచ్చి నాలుగేళ్ల కిందట వివాహం జరిపించారు.అప్పుడు లాంఛనంగా రూ.లక్ష రూపాయల నగదు, 11 తులాల బంగారం కట్నంగా ముట్టజెప్పారు. ఓ కుమారుడు పుట్టేంత వరకు ఆ దంపతులు అన్యోన్యంగా ఉన్నారు.కొద్ది రోజుల తర్వాత ఆ యువతి టీచర్‌ ఉద్యోగం సాధించింది.అప్పటి నుంచి అనుమానాలతో వేధింపులకు గురిచేస్తున్న భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

● పాల్వంచ మండలం ఆరెపల్లికి చెందిన యువతిని 11 ఏళ్ల క్రితం ఇందల్వాయి మండలం సిర్నాపల్లికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి జరిపించారు.లాంఛనంగా కట్నకానుకలు అప్పజెప్పారు.ఓ కుమారుడు పుట్టాక అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు.ఒక సారి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడినా మార్పు రాకపోవడంతో ఆ వివాహిత పోలీసులను ఆశ్రయించింది.

కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం
వరకట్నంతో ఇతర కారణాలతో మహిళలను వేధిస్తున్న కేసులలో ఇరువురికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. కౌన్సెలింగ్‌ తో పరిష్కారం కాని కేసులను కోర్టుకు పంపిస్తున్నాం.ఎవరైనా అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తే చట్టప్రకారం శిక్షార్హులవుతారు.

– ఎస్‌.అనిల్‌, ఎస్సై, మాచారెడ్డి

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)