Breaking News

Turmeric: మీకు ఈ సమస్యలు ఉంటే పసుపు అస్సలు వాడొద్దు!

Published on Wed, 07/05/2023 - 16:10

భారతీయ వంటకాల్లో తప్పనిసరిగా వాడే పదార్థాల్లో పసుపు కూడా ఒకటి. ఇది రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయుర్వేదంలో కూడా పసుపును ఔషధంగా ఉపయోగిస్తారు. పసుపులో యాంటీ బయోటిక్, కాల్షియం, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

అయితే అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నట్లు పసుపును కూడా మితంగానే వాడాలి. అధ్యయనం ప్రకారం రోజుకు ఒక టీ స్పూన్ పసుపు మాత్రమే తీసుకోవాలి. అంతకుమించి తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. ఒకవేళ మీరు దీర్ఘకాలంగా వ్యాధుల బారిన పడితే పసుపును వాడొద్దంటున్నారు నిపుణులు. 


♦ పసుపు డయాబెటిక్‌ ఫేషెంట్స్‌కు అంత మంచిది కాదు అంటారు. ఎక్కువగా పసుపు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ లెవల్‌ పెరుగుతుందట.
♦ పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సంబంధించి పలు సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు, వాంతులు కలగవచ్చు.

♦  ముఖ్యంగా ఐరన్‌ లోపంతో బాధపడుతున్న వాళ్లు పసుపును ఎక్కువగా తీసుకుంటే సమస్య మరింత అధికం అవుతుంది. 
♦  కామెర్లు ఉన్నవారు పసుపుకు వీలైనంతగా దూరంగా ఉండాలి. లేకపోతే ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది. 
♦  కొందరు అలర్జీతో బాధపడుతుంటారు. అలాంటి వారు చాలా మితంగా పసుపును వాడాలి. లేదంటే అలర్జీ సమస్య తీవ్రమవుతుంది. 
♦  కొందరికి శరీరంలో వేడి పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి వారు పసుపును ఎక్కువగా తినడం వల్ల మరింత వేడి పెరుగుతుంది. 

♦  అధికంగా పసుపు వినియోగించడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)