Breaking News

బ్రెస్ట్‌ కేన్సర్‌ ఉంటే భవిష్యత్తులో ఫర్టిలిటీ చాన్సెస్‌ తగ్గొచ్చా..?

Published on Sun, 12/08/2024 - 15:13

మా కజిన్‌కి 26 ఏళ్లు. బ్రెస్ట్‌ కేన్సర్‌ అని తేలింది. కీమో వల్ల భవిష్యత్తులో ఫర్టిలిటీ చాన్సెస్‌ తగ్గొచ్చు అంటున్నారు. తనకి వేరే ఆప్షన్‌ ఏదైనా ఉందా? 
– పద్మజ, వెస్ట్‌గోదావరి

కేన్సర్‌ ట్రీట్‌మెంట్‌లో ఇప్పుడు చాలా అడ్వాన్స్‌డ్‌ మెథడ్స్‌ వచ్చాయి. అలాగే ఫర్టిలిటీని ప్రిజర్వ్‌ చేసే కొత్త పద్ధతులు కూడా చాలా వచ్చాయి. కీమో రేడియేషన్‌తో అండాశయాలు దెబ్బతింటే భవిష్యత్తులో గర్భం దాల్చే  అవకాశాలు తగ్గిపోతాయి. కొన్ని ట్రీట్‌మెంట్స్‌ వల్ల అండాశయాలు చాలా వేగంగా దెబ్బతింటాయి. అందుకే క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌కి ముందే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్‌ ఆప్షన్స్‌ గురించి తెలుసుకోవాలి. వీటి గురించి ఆంకో ఫర్టిలిటీ క్లినిక్స్‌లో డిస్కస్‌ చేస్తారు. 

ఒవేరియన్‌ కార్టెక్స్‌ అంటే అండాశయ బాహ్యపొరలో అపరిపక్వ అండాలు ఉంటాయి. ఇవి నెమ్మదిగా డెవలప్‌ అయ్యి పరిపక్వ అండాలుగా, మంత్లీ సైకిల్‌లో విడుదలవుతాయి. కాబట్టి ఒవేరియన్‌ లేయర్‌ని డామేజ్‌ చేసే ట్రీట్‌మెంట్‌ తీసుకునే ముందు మల్టీ డిసిప్లినరీ టీమ్‌ డిస్కషన్‌తో.. ఈ ఒవేరియన్‌ టిష్యూని ప్రిజర్వ్‌ చేస్తారు. మత్తు మందు ఇచ్చి కీ హోల్‌ (లాపరోస్కోపీ) సర్జరీ ద్వారా ఒవేరియన్‌ టిష్యూని తీసి క్రయోప్రిజర్వ్‌ చేస్తారు. 

ఇందులో ఒక ఓవరీని లేదా ఒవేరియన్‌ టిష్యూ బయాప్సీస్‌ని తీసి ఫ్రీజ్‌ అండ్‌ ప్రిజర్వ్‌ చేస్తారు. మైనస్‌ 170 డిగ్రీ సెంటీగ్రేడ్‌ అల్ట్రా లో టెంపరేచర్‌లో ఉంచుతారు. క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ పూర్తయిన తరువాత లేదా ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌ సమయంలో ఈ టిష్యూను తిరిగి ఇంప్లాంట్‌ చేస్తారు. కొన్ని నెలల తరువాత ఈ టిష్యూ బాడీలో నార్మల్‌ ఫంక్షన్‌లోకి వచ్చి.. మంత్లీ సైకిల్స్, ఎగ్‌ డెవలప్‌మెంట్‌కి సిద్ధమవుతుంది. 

ఇది గత పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆసుపత్రుల్లో ప్రాక్టీస్‌లో ఉంది. దీనిద్వారా ప్రెగ్నెన్సీ సక్సెస్‌ అయిన కేసులూ ఉన్నాయి. మీ కజిన్‌ని ఒకసారి కౌన్సెలింగ్‌ సెషన్‌కి అటెండ్‌ అవమనండి. విషయం వివరంగా తెలుస్తుంది.  

డాక్టర్‌ భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌ 

(చదవండి: అలా జన్మించిన శిశువుల్లో గుండె లోపాలు..!)

 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)