Breaking News

బాత్‌రూంలోల ఎక్కువసేపు గడుపుతున్నారా? స్ట్రాంగ్‌గా హెచ్చరిస్తున్న నిపుణులు

Published on Thu, 11/14/2024 - 17:56

బాత్‌రూంలోకి వెళ్లగానే చాలామంది రిలాక్స్‌ అయిపోయి పాటలు పాడుకుంటూ గంటల కొద్దీ గడిపేస్తుంటారు. ఎవ్వరికైనా కాస్త రిలాక్స్‌ అయ్యే ప్రదేశం అది. అయితే కొందరూ మరీ విపరీతంగా బాత్‌రూంలో ఎన్ని గంటలు ఉంటారో చెప్పలేం. అవతలి వాళ్లు వీడెప్పుడు ఊడిపడతాడ్రా.. బాబు అని తిట్టుకుంటుంటారు. అలాంటి వారు దయచేసి అంతలా అన్ని గంటలు ఉండకండి. అలా ఉంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని గట్టిగా హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలాంటి అలవాటు వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో సవివరంగా వెల్లడించారు. 

చాలామంది రకరకాల ఆరోగ్య సమ్యలతో వస్తుంటారు. వారందరీ సమస్యలకు మూల కారణాలపై విశ్లేషించగా ఈ అంశం వెలుగులోకి వచ్చిందని అన్నారు. ఆయా సమస్యలతో బాధపడుతున్న రోగులంతా కూడా గంటలకొద్ది బాత్‌రూమ్‌లలో గడిపేవారని అన్నారు. కొందరైతే సెల్‌ఫోన్‌లు, ఐఫోన్‌లు ఇతర గాడ్జెట్‌లు తీసుకుని బాతూరూమ్‌ టాయిలెట్‌ సీట్‌పై కూర్చొని రిలాక్స్‌ అవుతుంటారని అన్నారు. 

ఇది అస్సలు మంచిది కాదని తెలిపారు. ఇప్పుడు చాలా వరకు అందరూ వెస్ట్రన్‌ టాయిలెట్లనే వాడుతున్నారు. అవి ఓవెల్‌ ఆకారంలో ఉండటంతో దానిపై తక్కువ ఎత్తులో కూర్చొంటాం. ఈ భంగిమలో గురత్వాకర్షణ శక్తి మనపై ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెకు రక్తాన్ని పంప్‌ చేయడాన్ని కష్టతరం చేస్తుంది. గురత్వాకర్షణ బలం తోపాటు నేలపై కలుగు చేసి ఒత్తిడి కలగలసి శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తుందట. 

ఫలితంగా పేగులో కొంత భాగం జారిపోయే ప్రమాదం ఉంటుందని  చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఈ భంగిమ వల్ల రక్త నాళాలు ఉబ్బి హేమరాయిడ్స్‌ ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపారు. ఇలా ఎక్కువ సేపు కూర్చొంటే పెల్విక్ కండరాలపై ఒత్తిడికి దారితీస్తుందని అన్నారు. అంతేగాదు ఈ అలవాటు అంతరర్లీనంగా ఎన్నో ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుందని, ముఖ్యంగా మలబద్ధకం, ప్రేగు సిండ్రోమ్‌ వంటి జీర్ణశయాంతర వ్యాధులను కలుగజేస్తుందని చెప్పుకొచ్చారు. 

అందువల్ల సుదీర్ఘంగా బాతూరూమ్‌లో గడపడాన్ని పరిమితం చేయమని చెబుతున్నారు. ముఖ్యంగా టాయిలెట్‌ సీటుపై కూర్చొనే అలవాటును దూరం చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఎలాంటి గాడ్జెట్‌లు, మ్యాగ్జైన్‌లు వంటివి బాత్‌రూమ్‌ దరిదాపుల్లోకి తీసుకెళ్లవద్దని అన్నారు.  

(చదవండి: సునీతా విలియమ్స్‌: ఆరోగ్యంగానే ఉన్నా..! సుదీర్ఘకాలం ఉంటే శరీరంలో..)

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)