షాకింగ్‌ ఘటన: మహిళ మెదడులో.. కొండచిలువ..

Published on Tue, 08/29/2023 - 12:10

ఓ మహిళ గత కొన్ని రోజులుగా విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి సమస్యలు ఎదుర్కొంది. ఇవన్నీ సాధారణమైనవే కదా అన్నట్లు మందులు వాడింది. అయినా ఎలాంటి ఫలితం లేకపోగా మతిమరుపు వంటి జ్వరం వంటివి మరీ ఎక్కువైపోయాయి. దీంతో వైద్యులు అన్ని పరీక్షలు చేశారు. అన్ని నార్మల్‌గానే వచ్చాయి. ఇక చివరిగా ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయగా..ఆమె మెదడులో ఉన్నదాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు వైద్యులు. ఈ షాకింగ్‌ ఘటన ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో చోటు చేసుకుంది.  

వివరాల్లోకెళ్తే..64 ఏళ్ల మహిళ విరేచనాలు, వాంతులు దీర్ఘకాలిక జ్వరం తదితర వాటితో గత కొంతకాలంగా బాధపడుతోంది. దీంతో వైద్యలు ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయగా ఆమె మెదడులో ఉన్న పరాన్నజీవిని చూసి ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఎందుకంటే అది కొండచిలువ శరీరంలో ఉండే ఒక విధమైన పురుగులాంటిది. అలా అని ఆమె పాములు పట్టే ఆమె కూడా కాదు. ఆమె కసలు పాములతో ఎలాంటి సంబంధ కూడా లేదు. అయితే ఆమె కొండచిలువలు నివశించే సరస్సు సమీపంలో నివసిస్తున్నందున ఈ పురుగు ఆమె మెదడులో వచ్చిందా అనే అనుమానం వ్యక్తం చేశారు.

ఎందుకంటే ఆమె వంట చేయడం కోసం అని గడ్డి వంటివి కోసుకువచ్చేది. అలాగే ఆకుకూరలు వంటి పదార్థాలను తీసుకొచ్చేది. ఈ కొండచిలువ వాటిపై పాకడం లేదా దాని మలం ద్వారా ఈ జీవి ఉండొ అవకాశం ఉందని. ఆమె ఆకుకూరలు తిన్నప్పుడో లేదా మరేవిధంగానో ఆమె శరీరంలోకి వెళ్లి మెదడులో కూర్చొందన్నారు. అది ఏకంగా ఎనిమిది సెంటీమీటర్ల పొడవుతో మెలికలు తిరిగనట్లు ఉందన్నారు. దీని కారణంగా ఆమె విపరీతమైన వాంతులు, కడుపునొప్పితో కూడిని విరేచనాలు వంటి సమస్యలను ఎదుర్కొందన్నారు. ఇక ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఆ పరాన్నజీవిని తీసేసినట్లు తెలిపారు.

సదరు పేషెంట్‌ కూడా నెమ్మది నెమ్మదిగా కోలుకుంటుందని అన్నారు. ఈ కేసు జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధుల ప్రమాదాల గురించి తెలియజేసిందన్నారు వైద్యులు. ప్రపంచవ్యాప్తంగా ఉ‍ద్భవిస్తున్న అంటువ్యాధులలో 75 శాతం జూనోటిక్‌ వ్యాధులేనని చెప్పారు. జూనోటిక్‌ అంటే జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులు.

ఇలానే కనోనా వైరస్‌లు కూడా మానవాళిని భయబ్రాంతులకు గురిచేసిందన్నారు. అందువల్ల మానవులు జంతువులను పెంచుకునేటప్పుడూ జాగ్రత్తలు పాటించాలని అన్నారు. టేప్‌వార్మ్‌ లాంటి బద్దె పురుగులు కేంద్ర నాడివ్యవస్థపై దాడి చేసి మూర్చ వంటి రుగ్మతలను కలుగ చేస్తాయన్నారు. ఇవి జంతువుల శరీరంలో పరాన్నజీవిగా ఆశ్రయించి ఉండటం కారణంగా..మనం వాటిని ఆహారంగా తీసుకోవడంతో మన శరీరంలో చేరి నెమ్మదిగా అభివృద్ధి చెంది కేంద్ర నాడివ్యవస్థపై దాడి చేస్తుందని అన్నారు. అందువల్ల బాగా ఉడకబెట్టి తగు జాగ్రత్తల పాటించి ఆహారంగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. 

(చదవండి: ఆ పరాన్నజీవి గుడ్లు నేరుగా నోట్లోకి వెళ్లడంతో..ఆ ముప్పు తప్పదు!)

Videos

తిరుమలలో వైఎస్ఆర్ సీపీ నేతలు

కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మల్లాది విష్ణు రియాక్షన్

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఆర్కే రోజా రియాక్షన్

దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ చార్జీలు..

తెలంగాణ భవన్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

బాహుబలి వర్సెస్ బుజ్జి

హిమాలయాల్లో రజినీకాంత్..

తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం

భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?

Photos

+5

తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్‌ హారిక నారాయణ్‌ (ఫోటోలు)

+5

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)