Breaking News

అగరుబత్తీలు వెలిగించడం..సిగరెట్లు కాల్చడం లాంటిదా..?

Published on Wed, 09/24/2025 - 12:41

భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంటూ టీవీలో వచ్చే అగరుబత్తీల యాడ్‌లు మనల్ని ఎంతలా ప్రేరేపిస్తాయంటే..అవి తెచ్చుకున్న వెంటనే ఉపయోగించాలనే ఆత్రుతను పెంచేస్తాయి. అదీగాక వాటి గుబాళింపు మనకు దేవాలయంలో ఉన్న అనుభూతిని అందిస్తాయి. పైగా ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ప్లేవర్ల అగరుబత్తీలు వచ్చేశాయి కూడా. ముఖ్యంగా భారతీయ గృహాల్లో ఇవి తప్పనిసరిగా ఉంటాయి. ఇవి ఆధ్యాత్మిక ఆనందాన్ని, మానసిక స్వాంతనను అందించడంలో ముందుంటాయి. అలాంటి అగరబత్తీలు వెలిగించడం, అచ్చం సిగరెట్లు కాల్చడం లాంటి అనారోగ్యానికి దారితీస్తుందా..?.ఔనని చెబుతున్నారు వైద్య నిపుణులు. సిగరెట్లు ఏవిధంగా ఊపిరితిత్తులకు హానికరమో అలానే అగరుబత్తీలు కూడా ప్రమాదమని చెబుతున్నారు. అదెలాగో సవివరంగా తెలుసుకుందామా..!.

ఇవి ఊపరితిత్తులకు ఎలా హానికరమో డెహ్రాడూన్‌కి చెందిన పల్మోనాలజిస్ట్‌ డాక్టర్‌ సోనియా గోయెల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ఈ అగరుబత్తీలు ఊపిరితిత్తులకు హాని కలిగించే కాలుష్య కారకాలను విడుదల చేస్తాయని, అవి అచ్చం పొగాకు మాదిరిగా ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు. వీటి నుంచి వచ్చే పొగ ఊపరితిత్తులకు నెమ్మది నెమ్మదిగా విషంలా మారుతుందని అన్నారు. 

ఏవిధంగా అంటే..
అగర్బత్తీలు సూక్ష్మ కణ పదార్థం (PM2.5), కార్బన్ మోనాక్సైడ్, అస్థిర సేంద్రీయ సమ్మేళనాలను విడుదల చేస్తుందని చెప్పుకొచ్చారామె. ఈ కాలుష్య కారకాలు మన ఇండోర్‌ గాలిని కలుషితం చేస్తాయని, ముఖ్యంగా మూసి ఉన్న ప్రదేశాల్లో శ్వాస తీసుకోవడం సురక్షితం కాదని తెలిపారామె. అంతేగాదు ఒక అగరబత్తిని ాకాల్చడం అంటే ఒక సిగరెట్‌ని కాల్చినంత ప్రమాదమని సోనియా అన్నారు. అంటే ధూమపాన అలవాటు లేకపోయినా..ఈ విధంగా పొగాకు సంబంధింత అనారోగ్యాల బారినపడతామని వెల్లడించారు.

అధిక ప్రమాదం ఎవరికంటే..
పిల్లలు, వృద్ధ కుటుంబ సభ్యులు, ఉబ్బసం లేదా  ఊపరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఈ అగరబత్తులను కాల్చడం ప్రాణాంతకమవుతుందని అన్నారు. ఒక్కోసారి అలెర్జీలు, దీర్ఘకాలిక దగ్గు,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల తలెత్తుతాయి. అలాగే సరైన వెంటిలేషన్‌ ఇంటిలో ఈ అగరబత్తీలు వెలిగిస్తే.. సంత్సరాల బడి ఆ పొగాకు బహిర్గతమైన ఆ ఇంటి సభ్యులకు బ్రోన్కైటిస్, ఉబ్బసం, COPD, ఊపరితిత్తుల కేన్సర్‌ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం అధికమవుతుందని అన్నారు. 

సరైన వెంటిలేషన్‌ ఉన్న ఇంటిలో వీటని ఉపయోగించినట్లయితే సమస్య ఉండదని అన్నారు. అలాగే ఆ సమయంలో కిటికీలు, ఫ్యాన్‌లు ఆన్‌ చేయడం వంటివి నష్టాన్ని చాలామటుకు తగ్గిస్తాయని అన్నారు. ఇంటిలో చక్కటి గాలి ప్రవాహం ఉంటే ఎలాంటి సమస్య ఉండదని అన్నారామె. 

ప్రత్యామ్నాయాలు..
ఈ అగరుబత్తీలు లేకుండా ఆచారాలు అసంపూర్ణం అనిపిస్తే..నూనె డిఫ్యూజర్‌లు, ఎలక్ట్రిక్ డయాలు ఉపయోగించండి. లేదా సహజ సూర్యకాంతి వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం వంటి వాటితో ఊరితిత్తుల సమస్యల బారిన పడకుండా ఉండటమే గాక ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా పొందగలుగుతామని అన్నారు డాక్టర్‌ సోనియా. 


 

 

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)