దైవకృప అంటే ఏమిటో తెలుసా? ఎలా వస్తుంది?

Published on Mon, 04/21/2025 - 10:37

సమస్యలు అనేవి ప్రత్యేకంగా ఉండవు. నీవు శరీరం–మనస్సులతో కలిసిపోయినపుడే సమస్యలనేవి కనిపిస్తాయి. ఆత్మతత్వంలో ఉన్నప్పుడు, సాక్షీభావనతో ఉన్నప్పుడు సమస్యలతో కలిసిపోవు. నీ మనస్సు నీ సంస్కారాలు ఎల్లప్పుడూ నిన్ను ఆత్మపథం నుండి దారిమళ్ళిస్తూనే ఉంటాయి. మనస్సు నిన్ను అత్మతత్వం వైపు వెళ్ళనివ్వదు. మనస్సుతో నీవు కలిసిపోతే సమస్యల్లో మునిగి ఆత్మకు దూరమవుతావు. లేదా శరీర సంబంధమైన సుఖాలు లేదా దుఃఖాలు, ఉద్రేకాలు, ఉద్వేగాలు, ఇష్టాలు, అయిష్టాలు, జబ్బులు, భయాలు మొదలైన వాటిల్లో కూరుకునిపోయి నీ నిజతత్వానికి దూరమయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అత్మపథంలో ఇన్నిరకాల అవరోధాలు తప్పవు. ఐనప్పటికీ దైవ కృప వల్ల ఆత్మదర్శనం  పొందుతావు. నీ సంస్కారాలు నశించి ఆత్మ ఉత్తేజితమైనప్పుడు ఆత్మదర్శనం జరుగుతుంది. నీవే ఆ చైతన్యమైపోతావు. ఇదే దైవకృప అంటే. ఆత్మ సహకారమే దైవకృప.

ఆత్మదర్శనం అంత సులభంగా జరిగిపోదు. మనస్సు నిన్ను ఎన్నిరకాలుగా బందీ చేయవచ్చునో అన్ని రూపాల్లోనూ నీకు ఆటంకాలు కల్పిస్తూనే ఉంటుంది, నీ సంస్కారాలకు అనుగుణంగా. ఎన్ని ఆటంకాలు కల్గినా నేను ఆత్మను అనే ఎరుక నిరంతరంగా ఉండాలి. కీర్తి, అపనింద, అధికారం, రకరకాల ఆకర్షణలు, వ్యసనాలు, ఆందోళనలు మొదలైనవి కుటుంబం రూపంలో, పిల్లల రూపంలో భార్యభర్తల రూపంలో, తల్లిదండ్రుల రూపంలో నిన్ను కిందికి లాగటానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఐనప్పటికీ వీటికి అంటకుండా సాక్షీతత్వంలో ఉన్నప్పుడే సత్యాన్ని తెలుసుకోగలవు. 

చదవండి: Kerala Tour అరేబియా తీరం, హౌస్‌బోట్‌ విహారం

అందుకే భగవద్గీతలో కష్ణుడు అంటాడు. కోటిమందిలో ఒక్కరు మాత్రమే ఆత్మదర్శనాన్ని   పొందగలరని. నిజానికి ఇక్కడ గెలుపు ఓటములనేవే ఉండవు. కేవలం సంఘటనలు జరుగుతుంటాయి. మనమే వాటితో కలిసిపోతూ ఉంటాము. నేను సాక్షీచైతన్యాన్ని అని తెలుసుకున్నప్పుడు ద్వంద్వాలు నీకు అంటనే అంటవు. జీవితంలో వచ్చే గెలుపు ఓటములు, లాభనష్టాలు, శరీరానికి వచ్చే వ్యాధులు మొదలైన వాటికి అతీతంగా ఎదగాలి. మన సంస్కారాల వల్లనే ఇవన్నీ ఏర్పడతాయి. శరీరం–మనస్సు నిత్యం మనల్ని ఆత్మతత్వం నుండి మళ్ళిస్తూ ఉంటుంది. ఇవన్నీ రకరకాల బంధనాలే. వేటికి చిక్కినా మళ్ళీ రాగద్వేషాల్లో పడి దుఃఖంలో కూరుకుపోతావు. అందుకే ఆత్మదర్శనం పొందడం అంత సులభం కాదంటారు. శరీరానికి కష్టం కల్గినపుడు లేదా ఏదైనా జబ్బు వచ్చినపుడు శరీరంతో మరింతగా కలిసిపోయి వ్యథలో కూరుకుపోయే అవకాశాలెక్కువ. శరీరానికి నొప్పి కల్గినప్పుడు ఈ శరీరం నేను కాదు, దీని వెనుక సాక్షిగా చూస్తున్న చైతన్యాన్నే నేను అనే ఎరుకను నిత్యం తీసుకురావాలి. అప్పుడే ఆ సంస్కారం నుండి బయటపడగలవు. 

ఇదీ చదవండి:  ముఖేష్‌ అంబానీ బర్త్‌డే బాష్‌, ఇదే హైలైట్‌!

అలాగే శత్రువులు, మిత్రులు, నీ పిల్లలు, భార్య/భర్త, తల్లిదండ్రులు, వృత్తి, సౌకర్యాలు మొదలైన వాటికి సంబంధించిన ఆలోచనలు వచ్చినప్పుడు కూడా వాటిని దూరం నుంచి సాక్షిగా చూడగలగాలి. ఈ సాక్షీ తత్వం నిరంతరంగా ఉన్నప్పుడే శరీరం–మనస్సుల నుండి బయటపడగలవు. వాటికి అతీతుడివి కాగలవు. 

– స్వామి మైత్రేయ
ఆధ్యాత్మిక బోధకులు

 

#

Tags : 1

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)