Breaking News

రోజుకు ఒక్క అరగంట చాలు, ఫలితాలు మాత్రం!

Published on Fri, 03/08/2024 - 16:59

నడక అన్ని వయసుల వారికి సరిపడే  చక్కటి వ్యాయామం. క్రమ తప్పకుండా వాకింగ్‌ చేస్తే ఫిట్‌గా ఉండటమేకాదు  ఆరోగ్య ప్రయోజనాలు కూడా  మెండుగా ఉన్నాయి. రోగ నిరోధకశక్తి బలపడి, మంచి ఆయుర్దాయానికి సాయపడుతుంది. 


నడక వల్ల ప్రయోజనాలు
♦ నడకతో  శరీరంలోని కొవ్వు నిల్వలు కలుగుతాయి. క్రమం తప్పకుండా వాకింగ్‌ చేస్తే ఊబకాయం కూడా నెమ్మదిగా  కరుగుతుంది. 
♦ రోజంతా మనసు హాయిగా, తేలిగ్గా ఉంటుంది. కొత్త ఉత్సాహం వస్తుంది.  రోగనిరోధక శక్తి పెరిగి జలుబు లేదా ఫ్లూ ప్రమాదం తగ్గుతుంది.


♦ రోజుకు కనీసం 30 నిమిషాలు, వారానికి ఐదు రోజులు నడవడం వల్ల  గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.  కొరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని దాదాపు 19 శాతం   తగ్గించవచ్చు. రోజూ  వాకింగ్‌  దూరాన్ని పెంచుకుంటే ఫలితాలు ఇంకా బావుంటాయి.
♦ రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది
♦ తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
♦ అల్పాహారం, భోజనం ,  రాత్రి భోజనం తర్వాత ఇలా రోజుకు మూడుసార్లు వాకింగ్‌ చేస్తే మంచిది.
♦ కీళ్ల నొప్పులు తగ్గుతాయి. నడక కాళ్ళ కండరాలను బలోపేతం చేస్తుంది 
♦ ఆర్థరైటిస్‌తో  బాధపడేవారికి కూడా   చిన్నపాటి  నడక  ప్రయోజనాలను అందిస్తుంది. 
♦ ముఖ్యంగా ఆరుబయట నడిచినపుడు సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయని పరిశోధకులు గుర్తించారు. 

నోట్‌: వాకింగ్‌కోసం ఉపయోగించే స్థలాలు, లేదా పార్క్‌లు ఎంచుకోవాలి. వాకింగ్‌కు అనువుగా దృఢమైన బూట్లు ధరించాలి. వదులుగా, సౌకర్యవంతమైన దుస్తులు ధరిస్తే మంచిది. నడకకు ముందు  పుష్కలంగా నీరు తాగితే బెటర్‌. ఇది మన బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. మరీ ఎండలో  కాకుండా, ఎండ తక్కువగా ఉన్నపుడు,  నీడ ప్రదేశంలో వాకింగ్‌ చేయాలి. 
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి