Breaking News

Preity Zinta PBKSలో కేవలం రూ 35 కోట్ల పెట్టుబడి : లాభం ఎంతో తెలుసా?

Published on Wed, 06/04/2025 - 17:05

ఐపీఎల్ 2025లో ఉత్కంఠగా సాగిన  ఫైనల్‌   మ్యాచ్‌లో  పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో  ముంబై ఇండియన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లిన పీబీకేఎస్, అదే తరహాలో టైటిల్‌ గెలుస్తుందని ఊహించిన అభిమానులకు  తీరని నిరాశ మిగిలింది. 18 ఏళ్ల నిరీక్షణ తరువాత ఆసీబీ టైటిల్‌ను దక్కించుకుంది. 

పీబీకేఎస్ విలువ 925 మిలియన్ డాలర్లు
ఐపీఎల్‌ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి పోటీ ఇచ్చిన పంజాబ్ కింగ్స్ యజమాని బాలీవుడ్‌ నటి,  ప్రీతి జింటా (Preity Zinta) ఆస్తి ఎంత, PBKS నెట్‌వర్త్‌ ఎంత అనే చర్చ నెట్టింట సందడిగా మారింది.  ప్రీతి జింటా ఐపీఎల్ టీం పీబీకేఎస్ విలువ 925 మిలియన్ డాలర్లుగా తెలుస్తోంది.

బాలీవుడ్‌ హీరో షారూఖ్ ఖాన్ సరసన ‘దిల్ సే’ మూవీతో ఆకట్టుకున్న ఈ సొట్ట బుగ్గల సుందరి రెండు దశాబ్దాలకు పైగాబాలీవుడ్‌ను ఏలింది. కెరీర్‌లో, ప్రీతి కల్ హో నా హో, వీర్ జారా, లక్ష్య, సలాం నమస్తే, సంఘర్ష్, కోయి... మిల్ గయా, క్యా కెహ్నా, కభీ అల్విదా నా కెహ్నా, చోరి చోరి చుప్కే చుప్కే, ది లాస్ట్ లియర్, సోల్జర్ , అనేక ఇతర చిత్రాలలో అద్భుతమైన పాత్రలు పోషించింది.

ప్రీతి జీన్ గూడెనఫ్‌ను వివాహం తరువాత అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో సిర్థపడింది. నటనకు దూరంగా ఉంది. ప్రీతి-జీన్‌ దంపతులకు కవల పిల్లలున్నారు.  అయితే, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ, ఐపీఎల్‌ జట్టు ఓనర్‌షిప్‌ ఇతర వ్యాపారాలు, ఎండార్స్‌మెంట్‌ల ద్వారా భారీ ఆస్తులను సంపాదించింది. 2008లో, ప్రీతి జింటా ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్‌కు సహ యజమానిగా, వ్యాపారవేత్తగా అవతరించింది.

మనీ కంట్రోల్  సమాచారం ప్రకారం,  2008లో ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్‌కు సహ యజమానిగా ప్రీతి ఆ సమయంలో రూ. 35 కోట్లు పెట్టుబడి పెట్టగా, అది ఇప్పుడు 350 కోట్ల రూపాయలకు  పెరిగింది. 2008లో పంజాబ్ కింగ్స్ ప్రారంభించినప్పుడు, దానిని విలువ 76 మిలియన్ డాలర్లుగా ఉంది. 2022 నాటికి 925 మిలియన్ డాలర్లకు పెరిగింది.

ప్రీతి జింటా ఆస్తి రూ. 183 కోట్లు 
ప్రీతి జింటా నికర ఆస్తుల విలువ రూ. 183 కోట్లు, ఇందులో ఆమె బ్రాండ్ ప్రమోషన్లు, వ్యాపార సంస్థలు, ఐపీఎల్ జట్టులో వాటా కూడా ఉన్నాయి. ముంబైలోని పాలి హిల్స్‌లో రూ. 17 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్  ప్రీతి  సొంతం.  జీన్ గూడెనఫ్‌తో వివాహం తర్వాత ఆమె అమెరికాకు వెళ్లి బెవర్లీ హిల్స్‌లో నివసిస్తున్నప్పటికీ  సిమ్లాలో రూ. 7 కోట్ల విలువైన ఇంటిని కూడా కొనుగోలు చేసింది.

బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల  ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. ప్రీతి జింటా  ప్రచారం చేసే ప్రతి బ్రాండ్ నుండి దాదాపు రూ. 1.5 కోట్ల నుండి రూ. 2 కోట్ల వరకు సంపాదిస్తుంది.  ప్రీతి జింటా కార్ల విషయానికి వస్తే లగ్జరీ కార్లు ఆమె గ్యారేజీలో ఉన్నాయి. వీటిలో  రూ. 132 లక్షల విలువైన లెక్సస్ 400 క్రాస్ఓవర్, రూ. 58 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ E క్లాస్, పోర్స్చే , BMW ఉన్నాయి.
 

Videos

పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు

ఆ మృతదేహం నాకొద్దు.. 8 రోజుల నుంచి మార్చురీలోనే మగ్గుతున్న డెడ్ బాడీ

దళితుడిని కొట్టిన కేసులో పోలీసులపై SC కమిషన్ చర్యలు

వామ్మో కోడి గుడ్డు! డబుల్ సెంచరీ దాటిన ట్రే

థియేటర్లు మొత్తం ఖాళీ.. ఇక చాలు కామెరూన్

రాహుల్, సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

అనంతపురం ఆకుతోటపల్లిలో కాల్పులు

దొరికింది దోచుకోవడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు

టీడీపీ నేతల వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య

గురజాలలో ఉద్రిక్తత

Photos

+5

దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్‌-9 విజేతగా కల్యాణ్‌.. ట్రోఫీతో ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ (ఫోటోలు)

+5

బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)