Breaking News

స్ట్రాబెర్రీ పండే కాదు..ఆకులతో కూడా : డబుల్‌ ధమాకా

Published on Wed, 07/03/2024 - 17:09

జ్యూసీ, జ్యూసీ స్ట్రాబెర్రీలు అంటే ఇష్టం లేని వారు దాదాపు ఉండరు. కాస్త ఖరీదు ఎక్కువైనా సరే, ప్రతీ బైట్‌లోనూ నోట్లోకి జారే తీపి పులుపుతో కూడిన  స్ట్రాబెర్రీ  టేస్ట్‌ను  ఆరగించాల్సిందే. అయితే స్ట్రాబెర్రీ  పండ్ల మాదిరి గానే, ఆకుల్లోకూడా అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చాలామందికి తెలియదు. మరి అవేంటో చూద్దాం రండి!

స్ట్రాబెర్రీ ఆకులు విటమిన్ సీ విషయంలో స్ట్రాబెర్రీ పండుతో పోటీపడతాయట.  సాధారణ ఆకు కూరల మాదిరిగానే, స్ట్రాబెర్రీ  ఆకులూ ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్, ఖనిజాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా ఎలాజిక్ యాసిడ్ అధిక స్థాయిలో ఉంటుంది.

రోగనిరోధక శక్తి, కొల్లాజెన్ ఉత్పత్తికి ఈ ఆకులు మంచిది. విటమిన్ ఏ, కే,  ఇనుము, కాల్షియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. స్ట్రాబెర్రీ ఆకుల యాంటీఆక్సిడెంట్ సామర్థ్యం మాంసం కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకుల అంచనా.

స్ట్రాబెర్రీ ఆకులలో సమృద్ధిగా లభించే ఫ్లేవనాయిడ్స్ వంటి సమ్మేళనాలు ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాలకు, శక్తివంతమైన సెల్ ప్రొటెక్టర్‌లుగా పనిచేస్తాయి. 

స్ట్రాబెర్రీ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. హైపర్‌ గ్లెసీమియా (ప్రమాదకర అధిక రక్త చక్కెర స్థాయిలు) టైప్ 2 డయాబెటిస్ వంటి పరిస్థితులతో ఉన్న వారికి మేలు చేస్తాయి. 

డైజెస్టివ్ ఎయిడ్‌గా ఉపయోగపడతాయి ఇందులోని డైటరీ ఫైబర్‌ జీర్ణశక్తిని మెరుగుపర్చి, గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

సన్నగా తరిగిన ఆకులు సలాడ్‌లలో యాడ్‌ చేసుకోవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. అలాగే హెర్బల్ టీలో కూడా వాడవచ్చు. 

ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. స్ట్రాబెర్రీ ఆకుల్లోని  ఆంథోసైనిన్స్ వంటి పాలీఫెనాల్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

నోట్: సేంద్రీయంగా పండించిన తాజా స్ట్రాబెర్రీ ఆకులను వాడటం ఉత్తమం. లేదా వీటి ఆకులను వాడే ముందు పురుగుమందుల అవశేషాలనుంచి  కాపాడుకునేందుకు  ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)