Breaking News

బంగారం లాంటి క్యారెట్‌ : మృదువైన చర్మం, మెరిసే జుట్టు, ఇలా ఎన్నో..!

Published on Wed, 09/04/2024 - 13:26

కూరగాయల్లో శ్రేష్టమైన క్యారెట్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. క్యారెట్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. రోగనిరోధక శక్తికినిచ్చే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా అనేక  బ్యూటీ సీక్రెట్స్‌ కూడా ఉన్నాయి. అందుకే దీన్ని  కాస్మొటిక్  వెజ్‌ అని కూడా అంటారు. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయ పడుతుంది.  కాలేయం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు చర్మం,జుట్టుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.  సెప్టెంబరు 1 నుండి 7వ తేదీ జరుపుకునే నేషనల్‌  నూట్రిషన్‌ వీక్‌ సందర్భంగా ఈ  విశేషాలు మీకోసం..

ఆఫ్ఘనిస్తాన్‌లో మొట్టమొదట పండించిన దుంప కూర క్యారెట్‌. మనకు తెలిసిన ఆరెంజ్‌ రంగులో మాత్రమే కాదు, ఊదా, పసుపు, ఎరుపు, తెలుపు  లాంటి ఇతర రంగులలో కూడా లభిస్తాయి. ఆరెంజ్ క్యారెట్లు 15-16వ శతాబ్దంలో మధ్య ఐరోపాలో అభివృద్ధి చేయబడ్డాయి.

క్యారెట్లలో శక్తి అందించే  విటమిన్లు ఏ, ఈ, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలతో పాటు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి.  గుండె, మూత్రపిండాలు ,కాలేయ ఆరోగ్యానికి  సాయం చేస్తుంది. క్యారెట్ విటమిన్ సి, లుటిన్, జియాక్సంథిన్, విటమిన్ కె, డైటరీ ఫైబర్‌కి మంచి మూలం. క్యారెట్‌లో పిల్లల ఎదుగుదలకు అవసరమైన బీటా కెరోటిన్‌ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. కంటి సమస్యలను దూరం చేస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మెరిసే చర్మాన్ని పొందడానికి మీరు క్యారెట్‌ను ఫేస్ ప్యాక్‌ల రూపంలో కూడా ఉపయోగించవచ్చు.  
 

మధుమేహ  రోజులు కూడా వాడవచ్చు.  ఇందులో సహజ చక్కెరలు తక్కువగా ఉంటాయి. డైటరీ ఫైబర్ రక్తంలోకి చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. క్యారెట్‌లో విటమిన్ సి, కె, మాంగనీస్, కాల్షియం, ఐరన్, పొటాషియం, కాపర్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి కూడా తోడ్పాటునందిస్తాయి. క్యారెట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయడటంతోపాటు.  చెడు కొలెస్ట్రాల్‌ను  తగ్గిస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి, బీటా కెరోటిన్ లక్షణాలు చర్మంపై మొటిమలు, దద్దుర్లు మొదలైన చర్మ వ్యాధులకు నయం చేయడంలో పనిచేస్తుంది. చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.

క్యారెట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులోని పీచు పదార్థం మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.వి తక్కువ కేలరీలున్న దీనిని పచ్చిగా తినవచ్చు. స్నాక్స్ లేదా డెజర్ట్‌ లాగా వాడుకోవచ్చు. అన్ని రకాల కూరల్లో, సలాడ్లలో  చేర్చుకుంటే అనేక పోషకాలు అందుతాయి.  విడిగా గానీ, బీట్‌ రూట్‌, పుదీనా లాంటివాటితో కలిపి గానీ  జ్యూస్‌ చేసుకొని తాగవచ్చు. అంతేకాదు అందంగా  కట్‌ చేసుకుని (గార్నిషింగ్‌) అలంకరించుకోవచ్చు కూడా

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)