Breaking News

ఈ టమాటాలతో సరదా యుద్ధం.. ఎలా మొదలైందో తెలుసా?

Published on Mon, 08/26/2024 - 14:06

దాదాపు ఎనిమిది దశాబ్దాల కిందట కొందరు మిత్రుల మధ్య సరదా వేడుకగా ప్రారంభమైంది. అనతి కాలంలోనే ఇది అతిపెద్ద ఆహార యుద్ధ వేడుకగా పేరు పొందింది. జనాలంతా వీథుల్లోకి చేరి, ఒకరిపై మరొకరు టమాటోలను విసురుకుంటూ, వీథుల్లో మడుగులు కట్టే టమాటో రసంలో మునిగి తేలుతూ సంబరాలు చేసుకునే ఈ వేడుక పేరు ‘లా టమాటినా’. స్పెయిన్‌లోని బునోల్‌ పట్టణంలో ఏటా ఆగస్టు నెలలో ఆఖరి బుధవారం రోజున ఈ వేడుక జరుగుతుంది. ‘లా టమాటినా’లో పాల్గొనే జనాలు టన్నుల కొద్ది టమాటోలను ఒకరిపై ఒకరు విసురుకోవడంతో, రోడ్లన్నీ టమాటో రసంతో నెత్తుటేర్లను తలపిస్తాయి.

ఈ సందర్భంగా దాదాపు 1.50 లక్షల కిలోల టమాటోలను ఒకరిపైకి ఒకరు విసురుకుంటారు. ఈసారి ‘లా టమాటినా’ వేడుకను ఘనంగా నిర్వహించడానికి బునోల్‌ పట్టణ సంస్థ ఏర్పాట్లు చేసింది. బునోల్‌ పట్టణ జనాభా దాదాపు తొమ్మిదివేలు మాత్రమే! అయితే, ఏటా జరిగే ఈ టమాటోల సరదా యుద్ధం తిలకించడానికి విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ వేడుకలో భాగంగా సంగీత, నృత్య కార్యక్రమాలు, విందు వినోదాలు కూడా జరుగుతాయి. ఈ వేడుక చూడటానికి విదేశాల నుంచి విపరీతంగా జనాలు వచ్చిపడుతుండటంతో బునోల్‌ పట్టణంలో హోటళ్లు కిటకిటలాడిపోయేవి.

స్థానికులకు మంచినీటి సరఫరాకు కూడా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ పరిస్థితిని నివారించడానికి 2013 నుంచి ఈ వేడుకను తిలకించడానికి వచ్చే సందర్శకుల సంఖ్య ఇరవైవేలకు మించరాదంటూ బునోల్‌ స్థానిక సంస్థ పరిమితి విధించింది. సందర్శకుల సంఖ్యను కట్టడి చేయడానికి అప్పటి నుంచి టికెట్లు కూడా ప్రవేశపెట్టారు. టికెట్లు పెట్టినా సరే సందర్శకులు ఏమాత్రం వెనుకాడకుండా ఈ వేడుకను చూడటానికి నెలల ముందుగానే బుకింగ్‌లు చేసుకుంటుండటం విశేషం. ‘లా టమాటినా’ స్ఫూర్తితో అమెరికాలోని కొలరడో–టెక్సస్‌ల మధ్య 1982 నుంచి ‘కొలరడో–టెక్సస్‌ టమాటో వార్‌’ వేడుక జరుపుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత కొలంబియా, చైనా తదితర దేశాల్లోనూ ఇలాంటి టమాటో యుద్ధాల నిర్వహణ మొదలు పెట్టారు. మన దేశంలో కర్ణాటకలోని బెంగళూరు, మైసూరు నగరాల్లోను, బిహార్‌ రాజధాని పట్నాలోను దాదాపు దశాబ్దంగా ఏటా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)