Breaking News

తొందర తొందరగా లాగించేస్తున్నారా? అయితే లావైపోతారు!

Published on Mon, 04/28/2025 - 11:02

వేగం..వేగం..అంతా స్పీడ్‌  యుగం. మల్టీ టాస్కింగ్‌.. పనులు ఎంత వేగంగా చేసుకుంటూ పోతే అంత మంచిది.  నెమ్మదిగా నత్తనడకన చేస్తానంటే కుదరదు. అంతా ఫాస్ట్‌. పనులు చక్క బెట్టుకోవడం వరకు   ఓకే కానీ.. ఆహారం విషయంలో వేగం అస్సలు పనికి రాదు.  ఆహారాన్ని  త్వరగా, ఆదరాబాదరగా మింగేయడం వల్ల  వల్ల అనేక రకాల రోగాలొచ్చే  ప్రమాదం ఉంటుంటున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు. నిజమేనా. నమ్మశక్యంగా లేదు కదూ, అసలు ఎలాంటి అనర్ధాలు వస్తాయో చూసేద్దాం

అన్నం గానీ, ఇంకేదైనా ఆహారాన్నిగానీ నెమ్మదిగా ప్రశాంతంగా,  బాగా నములుతూ  తినడం అనేది ఉత్తమం. ఆహారం నమ్మిలే సమయంలో నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది.  ఇలా లాలాజలంతో కలిపి మింగడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది. లేదంటే త్వర, త్వరగా అన్నం తినడం వల్ల అతిగా తినడం బరువు పెరిగే అవకాశం ఉంది.  అవును  నిజమే. ఎందుకంటే  గబా గబా తినడం వల్ల ఎంత తింటున్నాము అనేది అంచనా ఉండదు. కడుపు నిండిన సంకేతాలను మెదడు  అంత తొందరగా నమోదు చేయకపోవచ్చు.

త్వరగా తినడం వల్ల  తీసుకునే కేలరీల సంఖ్యంగా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా  రైస్‌ వంటి అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలతో కలిపి ఉన్నప్పుడు, కాలక్రమేణా బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.ఆహారం నమలకుండా  ఆబగా తినేయడంతోపాటు, కొంతమంది వెంటనే నీరు తాగుతూ ఉంటారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఇదీ జీర్ణ  సమస్యలకు  దారితీస్తుంది. కొవ్వు పేరుకు పోతుంది. అందువల్ల ఆహారాన్ని నోటిలోని మెత్తగా నమిలి ఆ తర్వాత మింగాలి.

పూర్తిగా నమలకుండా తినడం వల్ల  జీర్ణసమస్యలొస్తాయి. అజీర్తి కడుపు ఉబ్బరంతోపాటు, గట్ హార్మోన్ల పని నెమ్మదిస్తుంది.   వేగంగా మింగడం వల్ల ఆహారంతోపాటు,  గాలిని (సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో) ఎక్కువగా మింగే అవకాశం ఉటుంది. దీంతో పొట్టలో గ్యాస్‌ పేరుకుపోతుంది. వుక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం ఉంది.చాలా వేగంగా తినడం వల్ల  తినే ఆహారం   రుచిని పూర్తిగా ఆస్వాదించే  అవకాశాన్ని కోల్పోతాం.

అంతేకాదు ఆత్రంగా  భోజనం తీసుకోవడం వల్ల  మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం   కూడా ఉంది. తొందరగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల చక్కెర నిల్వల స్థాయి పెరిగిపోతుంది. ఆహారంలోని గ్లూకోజ్ ఎక్కువ స్థాయిలో రక్తంలో కలిసిపోతుంది. దీంతో మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం ఉంది. వేగంగా తినే వారు మెటబాలిక్‌ సిండ్రోమ్‌ను కలిగి ఉంటారు. దీని వల్ల గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ అవకాశం 23 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నమాట.భోజనం చేసే సమయాల్లో శుచిగా, శాంతంగా వ్యవహరించాలని, ప్రశాంత చిత్తంతో  ఉండాలని కూడా పెద్దలు చెప్పేమాట. 

 చివరగా .. కూటికోసంమే కోటి  విద్యలన్నట్లు..కూర్చుని భోజనం చేయడానికి 20 నిమిషాలు కేటాయించడం కంటే ముఖ్యమైన పని ఏముంటుంది.  ఒక పథకం ప్రకారం పనులు చేసుకుంటూ, ప్రశాంతంగా కూర్చుని భోజనం చేసేందుకు సమయాన్ని కేటాయించు కోవాలి. అనసరంగా సమయాన్ని వృధా చేసే పనులనుపక్కన బెట్టి  శ్రద్ధగా, రుచిని ఆస్వాదిస్తూ ఆహారం తీసుకోవాలి.

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)