నిమ్మ రసం తాగుతున్నారా? ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ తెలుసుకోండి!

Published on Sat, 03/02/2024 - 12:32

#LemonWater Side Effects వేసవి కాలం  వచ్చిందంటే నిమ్మకాయలకు గిరాకీ పెరుగుతుంది.  సమ్మర్‌ సీజన్‌లో నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వేసవిలో శరీరానికి కావల్సిన నీరు అందించడంతోపాటు,   జీర్ణ సమస్యలను తొలగించడం, బరువు నియంత్రణలో కూడా సాయం చేస్తుంది.  కానీ నిమ్మ నీరు ఎక్కువగా  తాగితే దుష్ప్రభావాలు ఉంటాయని మీకు తెలుసా? 

నిజానికి  నిమ్మలో ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, పొటాషియం వంటి ఖనిజాలు , ఫోలేట్ వంటి పోషకాలతో తోపాటు సీ విటమిన్‌ అధికంగా లభిస్తుంది. నీటికి రుచిని ఇవ్వడంతో పాటు,  నిమ్మ రసం చర్మానికి మెరుపు నిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ  మోతాదు మించి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమంటున్నారు ఆరోగ్య నిపుణులు.

 

నిమ్మరసం- సైడ్ ఎఫెక్ట్స్
♦
గుండెల్లో మంట వస్తుంది. మోతాదు మించితే పెప్టిక్ అల్సర్ వచ్చే ప్రమాదం, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) ఉన్నవారు నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. అలాగే సిట్రస్ పండ్లు తరచుగా తీసుకొంటే మైగ్రేన్‌, తలనొప్పి పెరుగుతాయి.
♦ డీహైడ్రేషన్ తలెత్తే ప్రమాదం ఎక్కువే. ఎందుకంటే  లెమన్‌ వాటరతో మూత్రం అధికమై, శరీరంలోని నీరు బయటకు పోతుంది. దీంతో  ఎలక్ట్రోలైట్లు , సోడియం వంటి మూలకాలు కూడా బయటకు వెళ్ళిపోతాయి.  అతిగా సేవిస్తే  పొటాషియం లోపం ఏర్పడుతుంది.
♦ విటమిన్ సీ  మోతాదు  ఎక్కువై, రక్తంలో ఐరన్  లెవల్స్‌ పెరుగుతాయి.  కొన్ని సందర్భాల్లో అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.  ఇందులోని సిట్రిక్ యాసిడ్, ఆక్సలేట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల  కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం.
♦ఎసిడిటీ వస్తుంది.
♦ ఎముకలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
♦ టాన్సిల్ సమస్య ఉన్నవారు నిమ్మరసానికి దూరంగా ఉండాలని, ఇది గొంతునొప్పి దారితీస్తుందని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది
♦  నిమ్మలోని సిట్రస్‌ వల్ల పళ్ల ఎనామిల్‌కు నష్టం.  దంత  సమస్యలు కూడా వస్తాయి

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)