Breaking News

వానమ్మ.. వాన! ఇన్ని రకాల వానలుంటాయంటే నమ్ముతారా?

Published on Sat, 09/21/2024 - 16:04

నిన్నమొన్నటి దాకా వానలు దంచి కొట్టాయి.  విపరీతంగా కురిసిన వానలతో ​‍ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. కాస్త తెరిపిన పడ్డారో లేదో   తెలంగాణాలో, హైదరబాద్‌లో మళ్లీ వానలు  ఆగమేఘాలమీద దూసుకొచ్చాయి.  అసలు వానలు ఎన్నిరకాలు,  వాటికి ఆ పేరు  ఎలా వచ్చిందో తెలుసా? నమ్మినా నమ్మకపోయినా,  వివిధ రకాల వర్షాలు ఉన్నాయి. అవును.  అంతేకాదు అన్ని వర్షాలు ఒకేలా ఉండవు! 

గాంధారి వాన –కంటికి ఎదురుగా ఉన్నది 
కనిపించనంత జోరుగా కురిసే వాన.
మాపుసారి వాన –సాయంత్రం కురిసే వాన
మీసర వాన – మృగశిర కార్తెలో కురిసే వాన
దుబ్బురు వాన – తుప్పర / తుంపర వాన
సానిపి వాన – అలుకు (కళ్లాపి చల్లినంత కురిసే వాన)
సూరునీల్ల వాన – ఇంటి చూరు నుంచి ధార పడేంత వాన
బట్టదడుపు వాన – ఒంటి మీదున్న బట్టలు తడిసేంత వాన
తప్పె వాన – ఒక చిన్న మేఘం నుంచి పడే వాన
సాలు వాన – ఒక నాగలి సాలుకు సరిపడా వాన
ఇలువాలు వాన – రెండుసాల్లకు – విత్తనాలకు సరిపడా వాన
మడికట్టు వాన – బురద  పొలం దున్నేటంత వాన
ముంతపోత వాన – ముంతతోటి పోసినంత వాన
కుండపోత వాన – కుండతో కుమ్మరించినంత వాన
ముసురు వాన – విడువకుండా కురిసే వాన
దరోదరి వాన – ఎడతెగకుండా కురిసే వాన


బొయ్య బొయ్య గొట్టే వాన – హోరుగాలితో కూడిన వాన
కోపులు నిండే వాన 
రోడ్డు పక్కన గుంతలు నిండేంత వన
రాళ్ల వాన – వడగండ్ల వాన
కప్పదాటు వాన – 
అక్కడక్కడా కొంచెం కురిసే వాన
తప్పడతప్పడ వాన – 
టపటపా కొంచెంసేపు కురిసే వాన
దొంగ వాన – రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన
ఏకార వాన – ఏకధారగా కురిసే వాన
మొదటి వాన – విత్తనాలకు బలమిచ్చే వాన
సాలేటి వాన – భూమి తడిసేంత భారీ వాన
సాలుపెట్టు వాన – దున్నేందుకు సరిపోయేంత వాన 
 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)