Breaking News

శీతాకాలంలో చుండ్రు, జుట్టు సమస్యలు : నువ్వులతో చెక్‌

Published on Sat, 12/14/2024 - 10:04

చర్మం  లాగానే జుట్టు  కూడా పొడిబారుతుంది.  ముఖ్యంగా చల్లని శీతాకాలంలో  ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. చుండ్రు సమస్యకూడా ఎక్కువగా వేధిస్తుంది.  కాబట్టి  జుట్టును  తేమగా ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.  ఆయిల్‌తో మసాజ్‌ చేసుకోవడం, ఎక్కువ హైడ్రేటింగ్ షాంపూలను ఉపయోగించడం లాంటివి చెయ్యాలి.  కండిషనింగ్‌ విషయంలో నువ్వుల నూనె బెస్ట్‌ ఆప్షన్‌ అని  చెప్పవచ్చు.  మరి  జుట్టు సంరక్షణలో  ఎలా వాడవచ్చో తెలుసుకుందాం!

జుట్టు సంరక్షణలో నువ్వులు

కప్పు నల్లనువ్వులను తీసుకుని మెత్తగా పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. అరలీటరు కొబ్బరి నూనెను మందపాటి పాత్రలో పోయాలి. దీనిలో నువ్వుల పొడి, నాలుగు మందార పువ్వులు, పది కరివేపాకులు వేసి సన్నని మంటమీద మరిగించాలి. 

మందారపువ్వులు, కరివేపాకు వేగాక నూనెను దించేసి చల్లారనిచ్చి, ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో నిల్వ చేసుకోవాలి. రెండురోజుల కొకసారి ఈ ఆయిల్‌ను తలకు పట్టించి మర్దన చేసి నాలుగు గంటల తరువాత తలస్నానం చేయాలి.

 క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గడమేగాక, బాలనెరుపు నియంత్రణలో ఉంటుంది. జుట్టుకూడా ఒత్తుగా పెరుగుతుంది. తెల్లనువ్వుల్లో  పోషకాలు ఉంటే నల్ల నువ్వుల్లో ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి మాడుని తేమగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి మాడుని పొడిబారకుండా చేసి, చుండ్రుని తగ్గిస్తాయి. యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ  గుణాలు చుండ్రుని మరింత విస్తరించకుండా నియంత్రిస్తాయి.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు