Breaking News

బార్లీ నీళ్లు తాగితే బరువు తగ్గుతారా? షుగర్‌ అదుపులో ఉంటుందా?

Published on Tue, 06/25/2024 - 13:48

మనకు ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే వాటిని మన ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వీటిల్లో అద్భుతమైన తృణధాన్యం బార్లీని ఒకటిగా చెప్పుకోవచ్చు. బార్లీలో బి-కాంప్లెక్స్, మాంగనీస్, సెలీనియం, ఫాస్పరస్, ఇనుము, కాల్షియం, జింక్ ఖనిజాలు లభిస్తాయి. ఇంకా పీచు పదార్థం, యాంటీఆక్సిడెంట్లు ఫైటో కెమికల్స్  పుష్కలంగా ఉంటాయి.

బీ విటమిన్‌, పీచు పదార్థం సంపూర్ణంగా మనకు అందాలంటే పొట్టుతోపాటు బార్లీ గింజలను తీసుకుంటే మంచిది. బార్లీ గింజల్ని బ్రెడ్, సూప్‌లు, ఇతర ఆహార ఉత్పత్తుల తయారీలోనూ, ఆల్కహాలిక్ పానీయాల్లో కూడా వాడతారు. ముఖ్యంగా బీర్‌మాల్ట్ మూలంగా కూడా పనిచేస్తుంది. 

బార్లీలో ప్రోటీన్లు, కార్పోహైడ్రేట్స్‌, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. పిల్లలకు ఇచ్చే సూప్‌లలో, పాలలో బార్లీ వాడితే, వారికి ఎదుగుదలకి, శక్తికి దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. 

బరువు నియం‍త్రణలో
బార్లీ వాటర్‌లో కేలరీలు తక్కువ. ఫైబర్ ఎక్కువ. ఇందులోని ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. మంచి ఆహారం, వ్యాయామంతో పాటు బార్లీ నీళ్లు తాగితే వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

షుగర్‌ వ్యాధిగ్రస్తులకు
బార్లీ నీళ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చేస్తుంది. మధుమేహం రోగుల్లో గ్లూకోజ్ స్థాయిల నిర్వహణకు ఉపయోగపడుతుంది.  

ఇంకా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. బార్లీ నీటిలో ఉండే పోషకాలు మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయని కొన్ని అధ్యయనాలు నివేదించాయి. కిడ్నీలో రాళ్లు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను కూడా తొలగిస్తుంది. పేగుల్లో ఉండే మలినాలు తొలగిపోతాయి. కేన్సర్‌ నివారణలో సాయపడుతుంది. అంతేకాదు  బార్లీ నీళ్లతో చర్మం కాంతివంతంగా మెరుస్తుంది కూడా.
 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)